
నిన్నటి ప్రోమోలో మాధురికి చీవాట్లు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni). కానీ ఎపిసోడ్‌లో మాత్రం ఆమెను బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కల్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 18వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
నా బుజ్జి తమ్ముడు
(Bigg Boss Telugu 9)నాగార్జున ఎక్కువగా వైల్డ్‌కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్‌బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డిమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్‌మేట్స్ షాకైపోయారు.

మాధురి పవర్ పాయే..
వైల్డ్‌కార్డ్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్‌కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.
మాధురి.. 200% కరెక్ట్
అలాగే మాధురి.. పవన్ కల్యాణ్‌తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి. కల్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్.

కన్ఫ్యూజన్‌లో పవన్- రీతూ
అయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కల్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు. కల్యాణ్‌ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. ఇక డిమాన్- పవన్‌ల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్‌లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్‌కు కళ్లు నెత్తికెక్కాయి, పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. అనంతరం మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.
చదవండి: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్