
బిగ్ బాస్ తెలుగు 9లో డబుల్ ఎలిమినేషన్(ఫ్లోరా సైనీ, శ్రీజ) తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చేశారు. అయితే, సోమవారం ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల హంగామా కనిపించింది. వాళ్ల రాకతో బిగ్‌బాస్‌లో వైల్డ్ తుపాన్ మొదలౌతుందని నాగార్జున సూచించారు. కానీ, అక్కడ అంత సీన్ ఏమీ లేదు. వచ్చిన వారందరూ కూడా పూర్తి కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష పక్కా ప్లాన్‌తోనే కల్యాణ్, తనూజలను టార్గెట్ చేశారని తెలుస్తోంది. టాప్‌లో ఉన్న వీరిద్దరిని టార్గెట్ చేస్తే వారిని ఇష్టపడని ఓటర్స్‌ను తమ వైపు లాగేయవచ్చనే స్ట్రాటజీ మొదలుపెట్టారనిపిస్తుంది.

సోమవారం ఎపిసోడ్‌లో కెప్టెన్‌గా ఉన్న కల్యాణ్‌ను మాధురితో పాటు రమ్య టార్గెట్ చేశారు. మొదట కల్యాణ్‌తో దివ్వెల మాధురి గొడవ పెట్టుకున్నారు. కూర్చోండి మేడం అని చాలా మర్యాదగా ఆమెకు గౌరవం ఇచ్చాడు కల్యాణ్. కానీ, ఇంత చిన్న విషయానికి ఆమె గొడవకు దిగారు. నువ్వేమైనా నా బాస్ అనుకుంటున్నావా అంటూ ఫైర్ అయ్యారు. కుర్చుంటేనే మాట్లాడుతారా అంటూ వెటకారంగా అనేశారు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఈ గొడవను భరణి ఆపాలని చూసినా మాధురి మాత్రం తగ్గలేదు. అయితే, కల్యాణ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత సమయం తర్వాత మాధురి మేడం సారీ అంటూ కల్యాణ్ కోరాడు. మీరు జీవితంలో ఎన్నో చూసి ఉంటారు. నేను చిన్నపిల్లోడినే క్షమించేయండి అంటూ కోరుతాడు. దీంతో మాధురి కూడా మంచిగానే రియాక్ట్ అయి ఆ గొడవను క్లోజ్ చేస్తారు.

నోరుజారిన రమ్య మోక్ష
సోమవారం ఎపిసోడ్ మొత్తం కల్యాణ్ చుట్టే నడిచింది. అతనిపై రమ్య మోక్ష చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగానే ఉన్నాయి. ఒక సందర్భంలో మాధురితో కూర్చొని మాట్లాడుతూ.. కల్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అంటూ పెద్ద కామెంట్ చేసింది. శ్రీజ ఎలిమినేషన్ రౌండ్‌లో తన బెలూన్ కట్ చేశానని ఆ అబ్బాయి కల్యాణ్ ప్రవర్తన వేరేలా ఉందంటూ చెప్పింది. అసలు తనతో కల్యాణ్ మాట్లాడట్లేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఎదురు పడితే ముఖం తిప్పుకోవడమే కాకుండా కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదని మోక్ష చెప్పింది. అయితే, ఈ సమయంలో మాధురి కూడా రమ్యకు వంత పాడుతుంది.
ఆ అబ్బాయితో మాట్లాడానికి ఇక్కడికి వచ్చామా లేదు కదా అని మాధురి చెబుతుంది. అతనికి (కల్యాణ్) అమ్మాయిల పిచ్చి ఫస్ట్.. అంటూ రమ్య మళ్లీ పైర్ అవుతుంది. ఈ సమయంలో మాధురి కూడా నోరు జారుతుంది. ఆ అబ్బాయి ప్రొఫెషన్ (ఆర్మీ) ఏంటో కూడా మర్చిపోయి ఇలా అమ్మాయిలతో చేస్తున్న విహేవ్ బాగాలేదంటుంది.

నా మీద చెయ్యి వేస్తే కిందేసి తొక్కేస్తా: రమ్య
రమ్య బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక కల్యాణ్, తనూజలనే టార్గెట్ చేసింది. వారిద్దరూ ప్రస్తుతం టాప్‌లో ఉన్నారు. కాబట్టి వారిని ట్రిగ్గర్ చేస్తే.. తనకు లాభం అనే స్ట్రాటజీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఎవరైతే కల్యాణ్, తనూజలను ఇష్టపడరో వారందరూ రమ్య వైపు తిప్పుకునేందుకే ఇలా స్కెచ్ వేస్తుందనిపిస్తుంది. ఈ క్రమంలోనే తనూజతో కల్యాణ్ బిహేవ్ చేస్తున్న తీరుపై రమ్య గట్టిగానే రియాక్ట్ అయింది. వారిద్దరి బాండింగ్ గురించి ఆమె ఇలా కామెంట్ చేసింది. " తనూజ, కల్యాణ్‌లను చూస్తుంటే చాలా ఇరిటేటింగ్‌గా ఉంది.
ఆమె (తనూజ) మీద కల్యాణ్ చేతులు ఇలా వేసేసి తడుముతుంటే చూసేందుకు నాకే ఏదోలా ఉంది. అదే విధంగా నాతో ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా.. కిందేసి తొక్కేస్తా.. ఈ విషయంలో తనూజ ఎందుకు ఊరుకుంటుదో తెలియడం లేదు. కల్యాణ్‌ను కూడా ఆమె ఆపేయడం లేదు. హేహే అంటుందే కానీ.. అతన్ని ఆపదు. అందుకే కదా అతను అలా బిహేవ్ చేస్తున్నాడు. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు. వారిద్దరి కాంబినేషన్ ఏంటో అర్థం కావడం లేదు. అంటూ రమ్య కామెంట్స్ చేసింది. అదంతా విన్న తర్వాత అక్కడే ఉన్న మాధురి కూడా నిజమే కదా అంటూ తల ఊపడం మరింత ఆశ్చర్యాన్ని ఇస్తుంది.
ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు..?
ఎపిసోడ్ చివరలో నామినేషన్ ప్రారంభమైంది. అయితే, వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో లేరు. కానీ, వారి నుంచే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఇప్పటి వరకు తనూజ వల్ల సుమన్ శెట్టి, రామూ రాథోడ్ వల్ల పవన్, సంజన వల్ల భరణి నామినేట్ అయ్యారు. మిగిలిన నామినేషన్స్ మంగళవారం ఎపిసోడ్‌లో చూపించనున్నారు. అయితే.. తనూజ , దివ్య, రాము కూడా ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.