నీ ఏజ్‌కు తగ్గట్లు ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్‌ | Tanuja and Ramya Big Fight In Bigg Boss 9 Telugu | Sakshi
Sakshi News home page

నీ ఏజ్‌కు తగ్గట్లు ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్‌

Oct 21 2025 10:45 AM | Updated on Oct 21 2025 11:10 AM

Tanuja and Ramya Big Fight In Bigg Boss 9 Telugu

బిగ్‌బాస్ హౌస్‌ నుంచి భరణి ఎలిమినేట్‌ అయిపోయిన తర్వాత బాండింగ్స్‌ గురించి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలో హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ అందరూ చాలా అలెర్ట్‌ అయిపోయారు. దీంతో  7వ వారం నామినేషన్స్‌లో బిగ్‌ వార్‌ కొనసాగింది. ఎలిమినేషన్‌ ప్రక్రియలో తనూజ -రమ్య మధ్య జరిగిన వార్‌తో పాటు రీతూ- ఆయేషాల మధ్య నడిచన మాటల ఫైర్‌ కూడా బాగానే పేలింది. ఎలిమినేషన్‌ రౌండ్‌లో ఇచ్చిన మాట తప్పావంటూ కల్యాణ్‌పై ఇమ్మాన్యేయల్ చేసిన కామెంట్లు ఆసక్తిగానే ఉన్నాయి. ఇలా ఈ వారం బిగ్‌ఫైట్‌తోనే మొదలైంది.

రీతూ- ఆయేషాలో ఫైర్‌ బ్రాండ్‌ ఎవరు
ఆయేషా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదు వారాల పాటు షో చూసి గేమ్‌లోకి దిగింది. రీతూ, తనూజలనే  టార్గెట్‌ పెట్టుకుని వచ్చినట్లు అర్ధం అవుతుంది. తానొక ఫైర్‌ బ్రాండ్‌ అనే రీతిలో ఆట మొదలు పెట్టింది. అయితే,  ఈ వారం నామినేషన్‌లో రీతూ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను మెప్పించలేదు. కేవలం లవ్‌లు ఆడేందుకే హౌస్‌లోకి వచ్చావని పదేపదే రీతూను టార్గెట్‌ చేస్తూ ఆయేషా మాట్లాడింది. ఇదంతా బయటున్న ప్రేక్షకులకు కూడా తెలిసిందే. మళ్లీ అదే పాయింట్‌తో నామినేషన్‌ చేయడం ఆయేషా చేసిన రాంగ్‌ స్ట్రాటజీ అని చెప్పవచ్చు.  

ఈ క్రమంలోనే రీతూ పట్ల చాలా దారుణమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే, రీతూ కూడా ఏంతమాత్రం తగ్గలేదు. కౌంటర్‌కు ధీటుగానే సమాధానం చెప్పకుంటూ పోయింది. రీతూ కేవలం లవ్‌ ట్రాక్‌తో మాత్రమే గేమ్‌ అడుతుందని చెప్పడవం చాలా రాంగ్‌.. గతంలో ఆమె చాలా బలంగా టాస్క్‌లు ఆడింది. అమ్మాయిల్లో శ్రీజ తర్వాత అంత గట్టిగా గేమ్స్‌ ఆడే సత్తా తనకు మాత్రమే ఉందని ఒప్పుకోవాల్సిందే. వీరిద్దరి మధ్య జరిగిన వార్‌లో రీతూనే ఫైర్‌ బ్రాండ్‌గా నిలిచిందని చెప్పవచ్చు.

వయసుకు తగ్గట్లు  ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్‌
నామినేషన్స్‌ ప్రక్రియలో మొదట తనూజను టార్గెట్‌ చేస్తూ రమ్య హీట్‌ పెంచింది. తనూజ టాప్‌లో ఉందని హైపర్‌ ఆది కూడా హింట్‌ ఇచ్చేశాడు. దీంతో ఆమెను టార్గెట్‌ చేస్తే కాస్త గేమ్‌ ట్రాక్‌లోకి వచ్చేస్తామనే ప్లాన్‌లో రమ్య ఉంది. అయితే, ఆట చూసే బరిలోకి దిగిన రమ్య పసలేని పాయింట్లతో తనూజను నామినేట్‌ చేసింది. తనూజ గురించి గత ఐదు వారాలుగా వస్తున్న వాటినే లేవనెత్తి మాట్లాడటం ఆపై తన గురించి బ్యాక్‌బిచ్చింగ్‌ చేయడం రమ్యకు నష్టాన్ని తెచ్చేలా ఉన్నాయి.

నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకూ  ఒక్క టాస్క్ కూడా ఆడలేదు..  మరోకరి సాయంతో మాత్రమే నిలబడుతున్నావ్‌ అంటూ తనూజ గురించి రమ్య అంటుంది. కేవలం బాండిగ్స్‌ కోసం మాత్రమే వచ్చావని, వాటి వల్లే ఇంట్లో ఉంటున్నావని కామెంట్స్‌ చేసింది. నువ్వు ఇంకా ముసుగులోనే ఉన్నావ్.. దాని నుంచి బయటికిరా.. ఫుల్ డ్రామా క్వీన్‌లా నటిస్తున్నావ్.. అంతా ఫేక్ అంటూ గట్టిగానే రమ్య మాట్లాడింది. తనూజ కూడా అంతే రేంజ్‌లో సమాధానం ఇచ్చింది.

నువ్వు నా మాస్క్ గురించి మాట్లాడుతున్నావా అంటూ రమ్యపై తనూజ ఫైర్‌ అయింది. ముందు నీ మాస్క్ నువ్వు చూసుకో.. కన్ఫెషన్ రూమ్‌లో నువ్వు ఏం అనిపించుకున్నావో అందరికీ తెలుసు. కాస్త వయసుకు తగినట్లు మాట్లాడు. ఫస్ట్‌ బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడటం ఆపేయ్‌. అంటూ తనూజ ఫైర్ అయింది. అప్పుడు రమ్య కూడా.. అవును, నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదంటూ మాటలు తూలింది. అలా ఇద్దరూ హౌస్‌లో హీట్‌ పెంచేశారు.

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ మాట్లాడిన నువ్వు బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడుతున్నావా అంటూ రమ్యపై తనూజ ఫైర్‌ అయింది. ఇది బిగ్‌బాస్‌లా లేదు లవర్స్ పార్క్‌లా ఉంది అన్నావ్.. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించుకో.. ఒకరికి మంట పెట్టాలని ఇంకొకరికి కోపం తెప్పించేలా మాట్లాడటానికే ఇక్కడికి  వచ్చావా అంటూ రమ్యపై  తనూజ ఫైర్ అయింది.

తనూజకు సరైన సమాధానం చెప్పలేక పర్సనల్ అటాక్ చేసేందేకు రమ్య దిగింది. నువ్వు జెలస్ రాణివి.. ఫేక్ పిల్లవి.. ఒకరు వెళ్లిపోయారు ఇంకొకర్ని వెతుక్కోనే పనిలో ఉంటావ్ .. అంటూ రమ్య వేసిన కౌంటర్‌కు తనూజ కూడా గట్టిగానే తిరిగిచ్చేసింది. ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్స్ కదా.. ఒక్కోసారి రెండు చేతుల క్లాప్ నుంచి వచ్చే శబ్ధం కన్నా ఒక్క చేతితో వేసే విజిల్ గట్టిగా వినిపిస్తుందంటూ.. విజిల్ వేసి మరీ తనూజ బదులిచ్చింది .

చెయ్‌ వెయ్‌ రా.. కల్యాణ్‌
తనూజ- కల్యాణ్‌ గురించి రమ్య చేసిన బ్యాక్‌బిచ్చింగ్‌కు తనూజ ఓపెన్‌గానే సమాధానం ఇచ్చింది. ఏదైనా ఉంటే మాతో చెప్పాలి.. వెనుకచాటు మాటలు ఎందుకంటూ రమ్యను ప్రశ్నించింది. నామినేషన్‌ టైమ్‌లోనే కళ్యాణ్ దగ్గరికెళ్లి.. ఒరేయ్ ఒకసారి నా భుజం మీద చెయ్‌ వెయ్‌ రా.. లాస్ట్ టైమ్ నువ్వు హ్యాండ్ వేయడానికి వస్తే ఛీ తియ్ అని అన్నాను. ఇప్పుడు వేయరా చూద్దాం.  ఏమైనా జరగని  అంటూ  తన తల మీద చెయ్ పెట్టమని కూడా తనూజ కోరుతుంది. ఈ సీన్‌ బాగా వైరల్‌ అయింది. తనూజకు బాగా కలిసొచ్చేలా ఈ ఎపిసోడ్‌ ఉంది. ఫైనల్‌గా ఈ వారం నామినేషన్‌లో తనూజ, రమ్య, కల్యాణ్‌, రాము, దివ్య, రాము, సంజన, శ్రీనివాస్‌ సాయి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement