బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా గేమ్ ఆడుతుంటారు. అయితే వీళ్లలో మధ్యలోనే ఎవరు బయటకొచ్చేస్తారు, ఎవరు చివరి వరకు ఉంటారనేది ఎప్పుడు సస్పెన్స్‌గానే ఉంటుంది. గతవారం అలా భరణి ఎలిమినేట్ కాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఈసారి అంతకు మించి బిగ్‌బాస్ షాక్ ఇచ్చాడు. పచ్చళ్ల పాపని బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
సోషల్ మీడియాలో పచ్చళ్ల బిజినెస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లలో రమ్య ఒకరు. రెండు వారాల క్రితం ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా 9వ సీజన్‌లో అడుగుపెట్టింది. కానీ వచ్చిన తొలిరోజు నుంచే టాక్ ఆఫ్ ది హౌస్ అయిపోయింది. ఫిజికల్ టాస్క్‌ల్లో మగాళ్లతోనే బాగానే పోటీ పడుతున్నప్పటికీ నోటి దురుసు, వ్యక్తిగతంగా పలువురు కంటెస్టెంట్స్‌పై కామెంట్స్ చేయడం లాంటి వాటి వల్ల నెగిటివిటీ వచ్చింది. దానికి తోడు వచ్చిన మొదటిరోజునే తనూజ-కల్యాణ్ రిలేషన్ గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం కూడా ఈమెకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: నాగార్జున రూట్‌లోనే చిరంజీవి.. కోర్ట్ ఆదేశాలు)
ఇకపోతే ఈ వారం రమ్యతో పాటు రీతూ, సాయి శ్రీనివాస్, దివ్య, తనూజ, రాము, సంజన, కళ్యాణ్ నామినేషన్స్‌లో నిలిచారు. వీళ్లలో చూస్తే రమ్య, సాయి తప్పితే మిగిలిన వాళ్లంతా చాలారోజులుగా హౌస్‌లో ఉన్నారు. పలుమార్లు నామినేషన్స్‌లోనూ ఉన్నారు. దీంతో ఈ వారం వీళ్లందరికీ బాగానే ఓట్లు పడ్డాయి. ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ టాప్‌లో నిలిచినట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో కల్యాణ్, దివ్య, రీతూ, సంజన ఉన్నట్లు టాక్. చివరి మూడు స్థానాల్లో రాము, సాయి శ్రీనివాస్, రమ్య ఉండగా.. రమ్యగా చాలాతక్కువగా ఓటింగ్ రావడంతో ఈమెని ఎలిమినేట్ చేసేశారట.
వాస్తవానికి ఈ వారం ఇప్పటికే ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. ఆమెనే ఆయేషా. డీహైడ్రేషన్, జ్వరం లక్షణాలతో ఈమె హౌస్ నుంచి బయటకొచ్చేసింది. కానీ కొన్నిరోజుల తర్వాత తిరిగి హౌసులోకి వెళ్లే అవకాశముంది. అయితే ఆయేషా బయటకొచ్చేయడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని ఫిక్స్ అయిన నిర్వహకులు.. పచ్చళ్ల పాప రమ్య మోక్షని ఎలిమినేట్ చేసేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్)


