డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు చెప్పగానే అభిమానులకు గుర్తొచ్చేది బొగ్గు. ఎందుకంటే ఇప్పటివరకు తీసిన సినిమాలన్నింటినిలోనూ హీరోలు మసి లేదంటే బొగ్గుతో కనిపిస్తారు. డ్రస్సులు కూడా డార్క్ కలర్‌లోనే ఉంటాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో తీస్తున్న 'డ్రాగన్' కూడా దీనికి ఏ మాత్రం తీసిపోదు. ఎందుకంటే ఇదివరకే పోస్టర్ రిలీజ్ చేస్తే అందులోనూ డార్క్ థీమ్ కనిపించింది.
(ఇదీ చదవండి: 'కాంతార' రిషభ్ ఇంట్లో ఇన్ని కార్స్ ఉన్నాయేంటి?)
అయితే ప్రశాంత్ నీల్.. డార్క్ కలర్ డ్రస్సుల్లో కాకుండా వేరే వాటిలో కనిపించడం అరుదని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా వైట్ షర్ట్, పంచెతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ భార్య కూడా ఫీలైనట్లుంది. దీంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసింది. 'నా దొంగమొగుడి ఫైనల్లీ వైట్ దుస్తుల్లో..' అని ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు కూడా సరదాగా నవ్వుకుంటున్నారు.
ప్రశాంత్ నీల్ తొలి సినిమా 'ఉగ్రం' నుంచి సినిమాటోగ్రాఫర్ చేస్తున్న భువన్ గౌడకి రీసెంట్‌గా పెళ్లి జరిగింది. 'కేజీఎఫ్' హీరోహీరోయిన్ యష్, శ్రీనిధి శెట్టితో పాటు మూవీ టీమ్‌లోని చాలామంది హాజరయ్యారు. ఇదే వేడుకలో భార్య లిఖిత రెడ్డితో పాటు ప్రశాంత్ నీల్ కూడా కనిపించాడు. డార్క్ కలర్ డ్రస్సులో కాకుండా తెల్లని దుస్తుల్లో కనిపించేసరికి అందరూ షాకవుతున్నారు. ఈ పెళ్లిలో హీరోయిన్ శ్రీలీల కూడా తల్లితో కలిసి కనిపించడం విశేషం.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ తేదీ)


