సూపర్ హీరోల సినిమాలు సరిగ్గా తీయాలే గానీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. హాలీవుడ్‌లో ఈ తరహా మూవీస్ ఎక్కువగా తీస్తుంటారు. మన దేశంలో మాత్రం ఆడపాదడపా మాత్రమే ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ జానర్ అనగానే చాలామంది హీరోలతోనే తీస్తుంటారు. కానీ ఫిమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'లోక'. మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.
కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఎలాంటి అంచనాల్లేకుండా ఆగస్టు 28న మలయాళంలో, 29న తెలుగులో రిలీజైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన దక్కించుకుంది. కేవలం రూ.30-40 కోట్ల బడ్జెట్ పెట్టగా.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. లెక్క ప్రకారం ఓటీటీలోకి ఎప్పుడో వచ్చేయాలి. కానీ థియేటర్లలో బాగా ఆడేసరికి కాస్త ఆలస్యం చేశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా)
ఈ నెల 31 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి హాట్‌స్టార్‌లో 'లోక' అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి ఈ సినిమా బాగా నచ్చేయగా.. మరికొందరికి మాత్రం ఓకే ఓకే అనిపించింది. మరి ఓటీటీలోకి వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?
'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కి సూపర్ పవర్స్ ఉంటాయి. దీని గురించి కొందరికే తెలుసు. కొన్ని కారణాల వల్ల చంద్ర.. బెంగళూరు వచ్చేస్తుంది. తన అతీంద్రయ శక్తుల్ని దాచిపెట్టి, సాధారణ అమ్మాయిలా బతుకుతూ కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో సన్నీ(నస్లేన్) ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటాడు. చంద్రని చూసి తొలిచూపులోనే సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. అసలు ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతమేంటి? ఈమెకు ఎస్ఐ నాచియప్ప (శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?)
The world of Lokah unfolds exclusively on JioHotstar, streaming from October 31st.@JioHotstarMal#Lokah #TheyLiveAmongUs@DQsWayfarerFilm @dulQuer @dominicarun@NimishRavi@kalyanipriyan@naslen__ @jakes_bejoy @chamanchakko @iamSandy_Off @santhybee @AKunjamma pic.twitter.com/dAklmsFR1M
— Wayfarer Films (@DQsWayfarerFilm) October 24, 2025


