పేరుకే తమిళ హీరో అయినప్పటికీ సార్, కుబేర లాంటి స్ట్రెయిట్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన ధనుష్.. రీసెంట్‌గా హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా ఓ మూవీ చేశాడు. అదే 'ఇడ్లీ కడై'. తెలుగులోనూ దీన్ని ఇడ్లీ కొట్టు పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
అక్టోబరు 01న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైంది. అయితే దీనికి ఒకరోజు తర్వాత 'కాంతార-1' రిలీజైంది. ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో ఇడ్లీ కొట్టు చిత్రం తెలుగులో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అదే టైంలో తమిళంలో మాత్రం మంచి వసూళ్లు వచ్చాయి. హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి వచ్చిన నెలలోపే అంటే అక్టోబరు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?)
'ఇడ్లీ కొట్టు' విషయానికొస్తే.. శంకరాపురం అనే ఊరిలో శివకేశవ(రాజ్ కిరణ్) ఓ ఇడ్లీ కొట్టు నడుపతుంటాడు. ఈ షాపులోని ఇడ్లీ.. చుట్టుపక్కలా చాలా ఫేమస్. ఇతడి కొడుకు మురళి(ధనుష్) మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని, హొటల్ మేనేజ్‌మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్లిపోతాడు.
కొన్నాళ్ల తర్వాత పనిచేస్తున్న కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలినీ పాండే)తోనే పెళ్లికి మురళి రెడీ అవుతాడు. సరిగ్గా పెళ్లికి రెండు మూడు రోజులు ఉందనగా శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి.. సొంతూరికి వస్తాడు. తర్వాత ఏమైంది? విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్(అరుణ్ విజయ్)తో మురళికి గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!)


