breaking news
Idli Kottu Movie
-
ఈ వారం ఓటీటీలో పండగే.. వరుసగా హిట్ సినిమాలు
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య బాగానే ఉంది. థియేటర్లో ఎటూ బాహుబలి ఎపిక్, మాస్ జాతర చిత్రాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం ‘కొత్తలోక: చాప్టర్ 1’ (kotha lokah chapter 1) ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. జియో హాట్‌స్టార్ వేదికగా అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇడ్లీ కొట్టు.. తిరు వంటి హిట్ సినిమా తర్వాత ధనుష్, నిత్యామేనన్ కలిసి జంటగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కోలీవుడ్‌లో రూ. 60 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీలో ధనుష్ పాత్ర చాలా బాగుంటుంది. తన తండ్రి కోరిక మేరకు వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తిలా ధనుష్ మెప్పించారు.‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 820 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీ మినహా దక్షిణాదికి చెందిన అన్ని భాషలలో విడుదల కానుంది. కాంతార సినిమాతో థియేటర్లలో తన సత్తా ఏంటో కన్నడ హీరో రిషబ్ శెట్టి చూపించారు. ఆయన దర్వకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు)నెట్ఫ్లిక్స్ఇడ్లీకొట్టు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 29బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 29ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 30ద వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరుఅమెజాన్ ప్రైమ్హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29హెడ్డా (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29ట్రెమెంబా (పోర్చుగీస్ సిరీస్) - అక్టోబరు 31కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 31హాట్స్టార్ఐటీ వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ సిరీస్) - అక్టోబరు 29లోక (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 31జీ5డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సిరీస్) - అక్టోబరు 31బాయ్ తుజాప్యా (మరాఠీ సిరీస్) - అక్టోబరు 31మారిగళ్లు (కన్నడ సిరీస్) - అక్టోబరు 31గణోసోత్రు (బెంగాలీ సిరీస్) - అక్టోబరు 31రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ (మూవీ) అక్టోబరు 31సన్ నెక్స్ట్బ్లాక్ మెయిల్ (తమిళ సినిమా) - అక్టోబరు 30 -
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి బాహుబలి ఎపిక్, మాస్ జాతర, ఆర్యన్, కర్మణ్యే వాధికరస్తే, ఆపరేషన్ పద్మ, ఎర్రచీర తదితర తెలుగు సినిమాలు రాబోతున్నాయి. వీటిలో బాహుబలి రీ రిలీజ్, మాస్ జాతర చిత్రాలపైనే కాస్తోకూస్తో బజ్ ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ హిట్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. పలు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉండటం విశేషం.(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. లోక, ఇడ్లీ కొట్టు, కాంతార ఛాప్టర్ 1 సినిమాలతో పాటు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. వీటితో పాటు ఏయే ఓటీటీల్లోకి ఏ మూవీస్ రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు)నెట్ఫ్లిక్స్ద అస్సెట్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 27ఇడ్లీకొట్టు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 29బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 29ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 30ద వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 31అమెజాన్ ప్రైమ్హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29హెడ్డా (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29ట్రెమెంబా (పోర్చుగీస్ సిరీస్) - అక్టోబరు 31కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 31హాట్స్టార్ఐటీ వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27మెగా 2.0 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 27మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ సిరీస్) - అక్టోబరు 29లోక (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 31జీ5డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సిరీస్) - అక్టోబరు 31బాయ్ తుజాప్యా (మరాఠీ సిరీస్) - అక్టోబరు 31మారిగళ్లు (కన్నడ సిరీస్) - అక్టోబరు 31గణోసోత్రు (బెంగాలీ సిరీస్) - అక్టోబరు 31సన్ నెక్స్ట్బ్లాక్ మెయిల్ (తమిళ సినిమా) - అక్టోబరు 30ఆపిల్ టీవీ ప్లస్డౌన్ సిమిట్రీ రోడ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29సైనా ప్లేమధురం జీవామృతబిందు (మలయాళ సినిమా) - అక్టోబరు 31(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా
పేరుకే తమిళ హీరో అయినప్పటికీ సార్, కుబేర లాంటి స్ట్రెయిట్ సినిమాలతో తెలుగులోనూ హిట్స్ కొట్టిన ధనుష్.. రీసెంట్గా హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా ఓ మూవీ చేశాడు. అదే 'ఇడ్లీ కడై'. తెలుగులోనూ దీన్ని ఇడ్లీ కొట్టు పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.అక్టోబరు 01న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైంది. అయితే దీనికి ఒకరోజు తర్వాత 'కాంతార-1' రిలీజైంది. ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో ఇడ్లీ కొట్టు చిత్రం తెలుగులో ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అదే టైంలో తమిళంలో మాత్రం మంచి వసూళ్లు వచ్చాయి. హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి వచ్చిన నెలలోపే అంటే అక్టోబరు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?)'ఇడ్లీ కొట్టు' విషయానికొస్తే.. శంకరాపురం అనే ఊరిలో శివకేశవ(రాజ్ కిరణ్) ఓ ఇడ్లీ కొట్టు నడుపతుంటాడు. ఈ షాపులోని ఇడ్లీ.. చుట్టుపక్కలా చాలా ఫేమస్. ఇతడి కొడుకు మురళి(ధనుష్) మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని, హొటల్ మేనేజ్మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. కొన్నాళ్ల తర్వాత పనిచేస్తున్న కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలినీ పాండే)తోనే పెళ్లికి మురళి రెడీ అవుతాడు. సరిగ్గా పెళ్లికి రెండు మూడు రోజులు ఉందనగా శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి.. సొంతూరికి వస్తాడు. తర్వాత ఏమైంది? విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్(అరుణ్ విజయ్)తో మురళికి గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్!) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
'ఇడ్లీ కొట్టు' కలెక్షన్స్.. హిట్ సాంగ్ విడుదల చేసిన మేకర్స్
ధనుష్, నిత్యా మేనన్ జోడీగా నటించిన చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. కానీ, కోలీవుడ్‌లో మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించిన సినిమాగా గుర్తింపు పొందింది. అయితే, తాజాగా ఈ సినిమాలో హింట్ సాంగ్ ఎన్న సుగమ్ వీడియో వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు.ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ. 70 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో కూడా మంచి టాక్ వచ్చింటే వంద కోట్ల మార్క్‌ను దాటేసేది. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాపై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీలో ధనుష్ పాత్ర చాలామందిని తమ గతాన్ని గుర్తు చేసిందని చెబుతారు. తన వ్యక్తిత్వం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేసి.. తండ్రి వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తిలా జీవితాన్ని గడుపుతాడు. అతనికి తోడుగా నిత్యా మేనన్ తన నటనతో జీవించేసింది. -
అక్టోబర్‌లో రిలీజయ్యే సినిమాలివే..
చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పందెం కోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే సంక్రాంతికి భారీపోటీ ఉంటుంది. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి పండగలు తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్ ఆలోచన. ఈ ఏడాది దసరా, దీపావళి పండగలు అక్టోబరులోనే రావడం విశేషం. సో.. సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచ్చు.ఈ నెల ఆరంభంలో ‘ఇడ్లీ కొట్టు, కాంతారా: చాప్టర్ 1’ వంటి డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ నెలలోనే రవితేజ ‘మాస్ జాతర’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం ‘కె.ర్యాంప్’, సాయికుమార్, అనసూయ ‘అరి’, రక్షిత్ అట్లూరి ‘శశివదనే’ వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ప్రభాస్ ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి. ‘బాహుబలి: ది ఎపిక్’గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇవి మాత్రమే కాదు... ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళదాం.బాహుబలి: ది ఎపిక్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 15న, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు పలు రికార్డులు, రివార్డులు సాధించింది.‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ఇంటర్నేషనల్ వైడ్‌గా ఈ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది? అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాలి.థియేటర్లలో జాతర రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. పైగా ‘ధమాకా’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.‘‘రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భాను భోగవరపు. ‘ధమాకా’ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘మాస్ జాతర’ కోసం సూపర్ మ్యూజిక్ అందించారు. మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్ పండగను తీసుకురాబోతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మనసు హత్తుకునే తెలుసు కదా! ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’.ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్రపోషించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.‘‘మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. మనసుని హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి. నీరజ కోన యునిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, వినోదాల ర్యాంప్ ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, క’ చిత్రాల ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్’. జైన్ ్స నాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.‘‘లవ్, రొమాన్ ్స, యాక్షన్, ఫన్‌తో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కె–ర్యాంప్’. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవ్వులు పంచే మిత్ర మండలి ‘బలగం, కోర్ట్’ చిత్రాల ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్. దర్శకత్వం వహించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. బ్రహ్మానందం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలుపోషించారు. బీవీ వర్క్స్(బన్నీ వాసు) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్పై కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.‘‘స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు మేకర్స్.తండ్రీ కొడుకుల అనుబంధం ‘పలాస 1978, నరకాసుర, ఆపరేషన్ రావణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్. తమిళ నటుడు శ్రీమాన్ కీలక పాత్రపోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘శశివదనే’. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులను నిరాశపరచదు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. దీపావళికి డ్యూడ్ ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రపోషించారు. ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. న్యూ ఏజ్ కథాంశంతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఆడియన్స్‌ని అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సమాజానికి సందేశం సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘‘మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్ పై బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్పోలీస్ కానిస్టేబుల్ పాత్రపోషించారు.సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని హైదరాబాద్ మాజీపోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ
ధనుష్ పేరుకే తమిళ హీరో కానీ.. సార్, కుబేర లాంటి తెలుగు సినిమాల్లోనూ నటించి మన ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. గతంలో రెండు మూడు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇతడు.. ఇప్పుడు అలా లీడ్ రోల్ చేసి దర్శకత్వం వహించి నిర్మించిన మూవీ 'ఇడ్లీ కొట్టు'. పెద్దగా ప్రమోషన్ చేయకుండానే తెలుగులోనూ తాజాగా (అక్టోబర్ 01) థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శంకరాపురం అనే ఊరిలో శివకేశవ(రాజ్ కిరణ్) ఓ ఇడ్లీ కొట్టు నడుపతుంటాడు. ఈ షాపులోని ఇడ్లీ.. చుట్టుపక్కలా చాలా ఫేమస్. ఇతడి కొడుకు మురళి(ధనుష్) మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని, హొటల్ మేనేజ్మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. కొన్నాళ్ల తర్వాత తను పనిచేస్తున్న కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలినీ పాండే)తోనే పెళ్లికి సిద్ధమవుతాడు. సరిగ్గా పెళ్లికి రెండు మూడు రోజులు ఉందనగా శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి.. సొంతూరికి వస్తాడు. తర్వాత ఏమైంది? విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్(అరుణ్ విజయ్)తో మురళికి గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓ కొడుకు.. కుటుంబ భవిష్యత్ కోసం భార్య పిల్లల్ని వదిలిపెట్టి మరీ పరాయి దేశంలో ఆరేళ్లు పనిచేస్తాడు. కొన్ని కారణాల వల్ల సొంతూరికి వస్తాడు. కన్నతల్లిని ఆప్యాయంగా పలకరిస్తే.. ఎవరు బాబు నువ్వు? అని అడుగుతుంది. నేను అమ్మ నీ కొడుకుని అంటే.. నా కొడుకు పేరు నీ పేరు ఒకటే అని అమాయకంగా అంటుంది తప్పితే కొడుకుని గుర్తుపట్టదు. దీంతో కొడుకు నోట మాటరాదు. ఒక్కసారిగా గుండె పగిలినంత పనవుతుంది. ఇది చెబుతున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో తెలీదు గానీ సినిమాలో ఈ సీన్ చూస్తున్నప్పుడు మాత్రం మనలో చాలామందికి గుండె కలుక్కుమంటుంది. ఎందుకంటే ఊరిని విడిచిపెట్టి ఎక్కడెక్కడి వెళ్లి ఉద్యోగాలు చేసే చాలామందికి ఈ సీన్ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇదే కాదు 'ఇడ్లీ కొట్టు' చూస్తున్నంత సేపు మీ సొంతూరు, అక్కడి మనుషులు, వాతావరణం ఇలా ప్రతిదీ గుర్తొస్తుంది.తెలుగులో తక్కువ గానీ తమిళ, మలయాళంలో అచ్చం మనకథలానే ఉందే అనిపించే సినిమాలు అడపాదడపా వస్తుంటాయి. ఇది కూడా అలాంటి ఓ చిత్రమే. స్టోరీ పరంగా చూస్తే ఇందులో కొత్తేం లేదు. చాలాసార్లు చూసిన కథే. కానీ ఎమోషన్ ఎంత వర్కౌట్ అయిందా? చూస్తున్నంతసేపు ఫీలయ్యామా లేదా ముఖ్యం. ఈ విషయంలో ధనుష్ అటు నటుడిగా ఇటు దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు.స్టోరీ సింపుల్‌గానే ఉండటం వల్ల రెండున్నర గంటల సినిమా కాస్త సాగదీతగానే అనిపిస్తుంది. ఒక్కసారి మూవీలోని ఎమోషన్‌కి కనెక్ట్ అయితే మాత్రం కన్నీళ్లు వస్తాయి. కచ్చితంగా ఎమోషనల్ అయిపోతాం. అలాంటి సీన్లు ఐదారు వరకు ఉన్నాయి. ట్రైలర్లో ఏదైతే చూపించారో దాదాపు స్టోరీ అదే. కాకపోతే తమిళ చిత్రాల్లో ఉన్నట్లు మనకు కావాల్సిన వాళ్లు చనిపోవడం, తద్వారా హీరో పడే బాధ, దాన్నుంచి వచ్చే ఎమోషన్స్ ఇలా ఈ తరహా సినిమాలు మీకు సెట్ అవుతాయి అనుకుంటే కళ్లు మూసుకుని వెళ్లిపోవచ్చు.చనిపోయిన తండ్రిని.. మన హీరో ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్న ఇడ్లీ కొట్టులోనూ, ఇంట్లో పెంచుకుంటున్న దూడలోనూ చూడటం.. దీని బ్యాక్ డ్రాప్లో వచ్చే సన్నివేశాలు అబ్బా భలే ఉన్నాయే అనిపిస్తాయి. ప్రారంభంలో కనిపించిన కొన్ని పాత్రలు ఊహించనట్లుగానే విలనీ షేడ్స్‌తో కనిపించి చివరకొచ్చేసరికి హీరోగా అండగా నిలబడటం లాంటివి ముందే అర్థమయిపోతాయి. కానీ వాటిని చూపించిన విధానం బాగుంది. ఈ మూవీ చూసిన తర్వాత కచ్చితంగా సొంతూరు, మన మనుషులు, మన మట్టిని ఎంతగా మిస్ అవుతున్నామో కదా అని కచ్చితంగా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?ధనుష్‌కి ఇలా అండర్ ప్లే చేసే పాత్రల్లో నటించడం కొట్టిన పిండి. అలా మురళిగా సాలిడ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కల్యాణిగా నిత్యామేనన్, అశ్విన్‌గా అరుణ్ విజయ్ అదరగొట్టేశారు. ఇదే సినిమాలో సత్యరాజ్, సముద్రఖని, పార్తిబన్ లాంటి సీనియర్స్ కూడా ఉన్నారు. వీళ్లకు తక్కువ స్కోప్ దొరికిందా కానీ ఎక్కడా అతి చేయకుండా సహజంగా నటించారు. ధనుష్ తండ్రి శివకేశవగా ఒకప్పటి నటుడు రాజ్ కిరణ్ బాగా చేశారు. మీరా పాత్రలో షాలినీ పాండే బాగుంది. మిగిలిన నటీనటులు ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే జీవీ ప్రకాశ్ కుమార్ బీజీఎం బాగుంది కానీ పాటలే పెద్దగా ఎక్కవు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నటుడిగా ధనుష్‌ని వంక పెట్టడానికి ఏం లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఎందుకో పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాడు. తమిళ ఆడియెన్స్ ఈ సినిమాకు ఫిదా అయిపోవచ్చు గానీ తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి? ఫ్లాట్ స్టోరీ, ఊహించినట్లు ఉండే స్క్రీన్ ప్లే దీనికి కారణం కావొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్‌కి నచ్చే సినిమా ఇది. తెలుగు డబ్బింగ్ బాగుంది. కుటుంబంతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన -
రాజమౌళి కంటే ధనుష్‌తోనే కష్టం: 'కట్టప్ప' సత్యరాజ్
తమిళ నటుడు సత్యరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 'బాహుబలి' కట్టప్పగా చాలా ఫేమస్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఇతడు ధనుష్ 'ఇడ్లీ కడై' మూవీలో కీలక పాత్ర పోషించాడు. అక్టోబరు 01న ఈ చిత్రం తెలుగు, తమిళంలో థియేటర్లలోకి రానుంది. శనివారం సాయంత్రం ట్రైలర్ లాంచ్ జరగ్గా.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సత్యరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. హీరోయిన్ రాశి)'రాజమౌళి, ధనుష్ ఇద్దరితో పనిచేయడం పోల్చిచూస్తే.. ధనుష్‌తో పనిచేయడమే కష్టం. ఎందుకంటే దర్శకుడిగా ధనుష్‌కి చాలా క్లారిటీ ఉంది. ఇడ్లీ కడై ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్ టైన్మెంట్ సినిమా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఢమాల్ డుమాల్ అనే యాక్షన్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇది అలాంటి మూవీ కాదు. ఇదో ఫీల్ గుడ్ మూవీ' అని సత్యరాజ్ చెప్పుకొచ్చాడు.రాజమౌళి డైరెక్షన్ అంటే నటీనటులని బాగా కష్టపెడతాడనే పేరుంది. అలాంటిది ఈ డైరెక్టర్ కంటే ధనుష్ డైరెక్షన్లో పనిచేయడం కష్టమని సత్యరాజ్ చెప్పడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇకపోతే ఈ మూవీ 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. మురళి అనే ఓ కుర్రాడు.. చెఫ్‌గా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తాడు. కానీ వారసత్వంగా వచ్చిన ఓ ఇడ్లీ కొట్టు నడిపేందుకు తిరిగి సొంతూరికి వచ్చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మరి మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్క సినిమాతో ఫేమస్.. కనిపించకుండా పోయిన ‘అందాల తార’!) -
ఆకట్టుకునేలా ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ట్రైలర్
ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'ఇడ్లీ కొట్టు'. అక్టోబరు 01న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. పూరి గుడిసెలో ఉండే ఓ ఇడ్లీ కొట్టు బ్యాక్ డ్రాప్లో సాగే ఓ ఎమోషనల్ జర్నీలా అనిపిస్తుంది. నిత్యామేనన్, అరుణ్ విజయ్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)ట్రైలర్ బట్టి చూస్తే మురళి(ధనుష్) తండ్రికి సొంతూరిలో చిన్న ఇడ్లీ కొట్టు ఉంటుంది. అదంటే ఆయనకు ఎంతో ప్రాణం. తండ్రిని చూస్తూ పెరిగిన మురళి.. పెరిగి పెద్దయ్యాక ఓ పెద్ద ఫుడ్ కంపెనీలో జాబ్ సాధిస్తాడు. అక్కడ పనైతే చేస్తుంటాడు గానీ మనసంతా ఊరిలో తమ ఇడ్లీ కొట్టుపైనే ఉంటుంది. తండ్రి తదనంతరం దాన్ని మూసేస్తారు. పెద్ద జాబ్ చేసుకునే మురళి.. ఊరికొచ్చి మళ్లీ తమ ఇడ్లీ కొట్టు ఎందుకు తెరిచాడు? ఈ స్టోరీలో విలన్ ఎవరు? అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.సెప్టెంబరు 25న తెలుగులో ఓజీ సినిమా రానుంది. దీనిపై అంచనాలు ఉన్నాయి. అలానే అక్టోబరు 2న పాన్ ఇండియా మూవీ 'కాంతార' సీక్వెల్ రాబోతుంది. ఈ రెండింటికి పోటీగా ధనుష్ 'ఇడ్లీ కొట్టు' చిత్రాన్ని బరిలో దింపుతున్నాడు. ఎమోషనే ప్రధానంగా తీసిన ఈ సినిమా.. ట్రైలర్ బట్టి చూస్తుంటే ప్రేక్షకుల మనసు గెలుచుకునేలా కనిపిస్తుంది. మరి 'ఇడ్లీ కొట్టు'.. పోటీలో ఉన్న మిగతా సినిమాలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో?(ఇదీ చదవండి: రీతూ బండారం బట్టబయలు.. పవన్ కెప్టెన్సీ ఫసక్) -
'ఇడ్లీ కొట్టు' టైటిల్ ఎందుకు పెట్టామంటే..: ధనుష్
నటుడు ధనుష్ తాజాగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు). నటి నిత్యామీనన్ నాయకిగా నటించారు. శాలిని పాండే, సత్యరాజ్, అరుణ్‌విజయ్, రాజ్‌కిరణ్, పార్తీపన్, సముద్రఖని తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్1వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇడ్లీ కొట్టు అని పేరు పెట్టడానికి కారణం గురించి చెబుతూ చిన్నతనంలో తనకు రోజూ ఇడ్లీ తినాలని ఆశగా ఉండేదన్నారు. అయితే చేతిలో డబ్బు ఉండేది కాదన్నారు. దీంతో తోటల్లో పూలు కోసే పనికి వెళితే రోజుకు రూ. 2 లేదా 2.50 రూపాయలు ఇచ్చేవారన్నారు. ఆ డబ్బుతో నాలుగు లేదా ఐదు ఇడ్లీ వస్తే కొనుక్కుని తినేవాడినన్నారు. ఆ ఇడ్లీ రుచి ఇప్పుడు పెద్ద పెద్ద ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ లభించడం లేదన్నారు. ఆ ఇడ్లీ కొట్టు ఇతి వృత్తంతో చిత్రం చేయాలని అనిపించిందన్నారు. అలా నిజమైన కథ, నిజమైన పాత్రలతో చిత్రం చేసినట్లు ధనుష్ చెప్పారు. అదే విధంగా తన హేటర్స్ గురించి స్పందిస్తూ అసలు హేటర్స్ అనే కాన్సెప్టే పరిశ్రమలో లేదన్నారు. అలాంటి వారు కూడా ఇక్కడ లేరన్నారు. అందరూ అన్ని చిత్రాలు చూస్తుంటారని, అలాంటిది హేటర్స్ ఎవరని చెప్పాలంటూ పేర్కొన్నారు. అయితే ఒక 30 మంది తమ జీవనం కోసమో లేదా మరేదైనా ఆశించో 300 ఐడియాలతో ఏదైనా తప్పుడు ప్రచారం చేయడమే హేట్ అని తెలిపారు. ఆ 30 మంది కూడా చిత్రాలను చూస్తారని ధనుష్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ వేదికపై మాట్లాడిన నటుడు పార్తీపన్ నటుడు ధనుష్‌ను సకలకళావళ్లభుడిగా పేర్కొన్నారు. ఇక ఆయన అభిమానులైతే యువ సూపర్‌స్టార్ అంటూ పోస్టర్లతో ప్రచారం చేశారు. -
నేను ధనుష్‌ని వెన్నుపోటు పొడవలేను: జీవీ
డబ్బింగ్ సినిమాల మూలాన తమిళ హీరోహీరోయిన్లతో పాటు టెక్నిషియన్లు కూడా తెలుగు ప్రేక్షకులకు చాలావరకు పరిచయమైపోతున్నారు. పాన్ ఇండియా మూవీస్ వల్ల చాలామంది కోలీవుడ్.. మన దగ్గర పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఒకడు. తెలుగు, తమిళంలో పలు చిత్రాలు సంగీతమందిస్తూ బిజీగా ఉండే ఇతడు.. ఇప్పుడు ఓ సీక్రెట్ బయటపెట్టాడు. ధనుష్‌ని తాను వెన్నుపోటు పొడవలేనని చెప్పుకొచ్చాడు.ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'ఇడ్లీ కడై'. దీన్ని 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబరు 01న థియేటర్లలోకి రానుంది. నిన్న అంటే ఆదివారం ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైల్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలోనే మాట్లాడిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్.. గతేడాది రిలీజైన ధనుష్ 'రాయన్'లో తనకు నటించే అవకాశం వచ్చిందని, కానీ దాన్ని వద్దనుకున్నట్లు చెప్పాడు.(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?)'రాయన్ మూవీలో తమ్ముడి పాత్ర చేయమని ధనుష్ నన్ను మొదట అడిగారు. అయితే ఆ పాత్ర ధనుష్ పాత్రని వెన్నుపోటు పొడుస్తుంది. ఆ పాయింట్ నచ్చక నేను నో చెప్పేశాను. సినిమాలో కూడా నా స్నేహితుడిని మోసం చేసే పాత్రని చేయను' అని జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రాయన్'లో ధనుష్ తమ్ముళ్లుగా కాళిదాస్, సందీప్ కిషన్ నటించారు. ఇందులో ఓ పాత్రనే జీవీ చేయాల్సింది కానీ వద్దనేశాడనమాట.ఇకపోతే 'ఇడ్లీ కొట్టు' సినిమా.. పూర్తిగా ఎమోషన్స్ బేస్ చేసుకుని తీశారు. ధనుష్, నిత్యామేనన్, సత్యరాజ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే లీడ్ రోల్స్ చేశారు. దసరా కానుకగా తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దీనికి ఐదు రోజుల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ', ఓ రోజు తర్వాత 'కాంతార' సీక్వెల్ విడుదల కానున్నాయి. మరి వీటితో నిలబడి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: రూ.100 కోట్లకు చేరువలో 'మిరాయ్' కలెక్షన్) -
రిలీజ్‌కి సిద్ధమైన ధనుష్ 'ఇడ్లీ కొట్టు'
తమిళ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. దీంతో ఎప్పటికప్పుడు ఇతడి సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు కొత్త మూవీని రెడీ చేశాడు. ధనుష్ లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇడ్లీ కడై'. దీన్ని తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో తీసుకురానున్నారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?)పవన్ కల్యాణ్ 'ఓజీ'.. సెప్టెంబరు 25న థియేటర్లలోకి రానుంది. ఇదొచ్చిన ఐదు రోజులకే 'ఇడ్లీ కొట్టు' థియేటర్లలోకి వస్తుంది. దీని తర్వాత రోజున 'కాంతార' ప్రీక్వెల్ విడుదల కానుంది. చూస్తుంటే ఈసారి దసరాకు బాక్సాఫీస్ దగ్గర మంచి సందడిగా ఉండనుందని అర్థమైపోతోంది. 'ఇడ్లీ కొట్టు' సినిమా పూర్తిగా కంటెంట్, ఎమోషన్స్‌పై ఆధారపడి తీశారు. ధనుష్, నిత్యామేనన్, అరుణ్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)


