మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి బాహుబలి ఎపిక్, మాస్ జాతర, ఆర్యన్, కర్మణ్యే వాధికరస్తే, ఆపరేషన్ పద్మ, ఎర్రచీర తదితర తెలుగు సినిమాలు రాబోతున్నాయి. వీటిలో బాహుబలి రీ రిలీజ్, మాస్ జాతర చిత్రాలపైనే కాస్తోకూస్తో బజ్ ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ హిట్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. పలు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉండటం విశేషం.
(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)
ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. లోక, ఇడ్లీ కొట్టు సినిమాలతో పాటు డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. వీటితో పాటు ఏయే ఓటీటీల్లోకి ఏ మూవీస్ రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు)
నెట్‌ఫ్లిక్స్
ద అస్సెట్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 27
ఇడ్లీకొట్టు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 29
బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29
స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 29
ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 30
ద వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 31
అమెజాన్ ప్రైమ్
హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29
హెడ్డా (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29
ట్రెమెంబా (పోర్చుగీస్ సిరీస్) - అక్టోబరు 31
హాట్‌స్టార్
ఐటీ వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27
మెగా 2.0 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 27
మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ సిరీస్) - అక్టోబరు 29
లోక (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 31
జీ5
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సిరీస్) - అక్టోబరు 31
బాయ్ తుజాప్యా (మరాఠీ సిరీస్) - అక్టోబరు 31
మారిగళ్లు (కన్నడ సిరీస్) - అక్టోబరు 31
గణోసోత్రు (బెంగాలీ సిరీస్) - అక్టోబరు 31
సన్ నెక్స్ట్
బ్లాక్ మెయిల్ (తమిళ సినిమా) - అక్టోబరు 30
ఆపిల్ టీవీ ప్లస్
డౌన్ సిమిట్రీ రోడ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29
సైనా ప్లే
మధురం జీవామృతబిందు (మలయాళ సినిమా) - అక్టోబరు 31
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు)


