‘పలాస 1978’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శశివదనే’. అక్టోబరు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సాయి మోహన్ ఉబ్బర దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు. ఇప్పటికే సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో కూడా తాజాగా విడుదలైంది.
'శశివదనే' విషయానికొస్తే.. గోదావరి లంకల్లోని ఓ పల్లెటూరి కుర్రాడు రాఘవ(రక్షిత్ అట్లూరి). పీజీలో కెమిస్ట్రీ చేసేందుకు రెడీ అవుతుంటాడు. తల్లి లేకపోవడంతో తండ్రి (శ్రీమాన్) ఇతడిని పెంచి పెద్ద చేస్తాడు. తన తండ్రిలానే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని రాఘవ అనుకుంటూ ఉంటాడు. ఓరోజు అనుకోకుండా శశి(కోమలి ప్రసాద్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ పొందేందుకు తెగ ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? ఈ ప్రేమకథలో తలెత్తిన సమస్యలేంటి? ప్రేమికుడైన రాఘవ జైలు పాలవ్వడానికి కారణమేంటి? అనేదే మిగతా స్టోరీ.


