సెలబ్రిటీలు పెళ్లి అంటే కొన్నిరోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. సంగీత్, హల్దీ, పెళ్లి అంటూ సెలబ్రేషన్ ఉండనే ఉంటాయి. ఆ టైంలో సోషల్ మీడియాలోనూ ఫొటోలు బాగానే వైరల్ అవుతుంటాయి. కానీ రీసెంట్ టైంలో చూస్తే ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?)
ఈ నెల ప్రారంభంలో నాగచైతన్య-శోభిత తమ తొలి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి వీడియోని సోషల్ మీడియాలో శోభిత షేర్ చేసింది. వివాహం జరిగినప్పుడు కేవలం ఫొటోలని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వీడియోని పోస్ట్ చేసి అభిమానులకు క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేశ్ వంతు వచ్చింది. ఈమె కూడా పెళ్లి టైంలో కేవలం ఫొటోలని మాత్రమే పంచుకుంది. తమ బంధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వివాహ వీడియోని షేర్ చేసింది. ఇందులో హల్దీ, సంగీత్, హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన పెళ్లికి సంబంధించిన విజువల్స్ అన్నీ చూడొచ్చు. కీర్తి, ఆమె భర్త ఆంటోనీతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో ఆనందంగా కనిపించారు.
(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?)


