
ధనుష్, నిత్యా మేనన్ జోడీగా నటించిన చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. కానీ, కోలీవుడ్‌లో మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించిన సినిమాగా గుర్తింపు పొందింది. అయితే, తాజాగా ఈ సినిమాలో హింట్ సాంగ్ ఎన్న సుగమ్ వీడియో వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ. 70 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో కూడా మంచి టాక్ వచ్చింటే వంద కోట్ల మార్క్‌ను దాటేసేది. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాపై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీలో ధనుష్ పాత్ర చాలామందిని తమ గతాన్ని గుర్తు చేసిందని చెబుతారు. తన వ్యక్తిత్వం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేసి.. తండ్రి వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తిలా జీవితాన్ని గడుపుతాడు. అతనికి తోడుగా నిత్యా మేనన్ తన నటనతో జీవించేసింది.