
డబ్బింగ్ సినిమాల మూలాన తమిళ హీరోహీరోయిన్లతో పాటు టెక్నిషియన్లు కూడా తెలుగు ప్రేక్షకులకు చాలావరకు పరిచయమైపోతున్నారు. పాన్ ఇండియా మూవీస్ వల్ల చాలామంది కోలీవుడ్.. మన దగ్గర పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఒకడు. తెలుగు, తమిళంలో పలు చిత్రాలు సంగీతమందిస్తూ బిజీగా ఉండే ఇతడు.. ఇప్పుడు ఓ సీక్రెట్ బయటపెట్టాడు. ధనుష్‌ని తాను వెన్నుపోటు పొడవలేనని చెప్పుకొచ్చాడు.
ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'ఇడ్లీ కడై'. దీన్ని 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబరు 01న థియేటర్లలోకి రానుంది. నిన్న అంటే ఆదివారం ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైల్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలోనే మాట్లాడిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్.. గతేడాది రిలీజైన ధనుష్ 'రాయన్'లో తనకు నటించే అవకాశం వచ్చిందని, కానీ దాన్ని వద్దనుకున్నట్లు చెప్పాడు.
(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?)
'రాయన్ మూవీలో తమ్ముడి పాత్ర చేయమని ధనుష్ నన్ను మొదట అడిగారు. అయితే ఆ పాత్ర ధనుష్ పాత్రని వెన్నుపోటు పొడుస్తుంది. ఆ పాయింట్ నచ్చక నేను నో చెప్పేశాను. సినిమాలో కూడా నా స్నేహితుడిని మోసం చేసే పాత్రని చేయను' అని జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రాయన్'లో ధనుష్ తమ్ముళ్లుగా కాళిదాస్, సందీప్ కిషన్ నటించారు. ఇందులో ఓ పాత్రనే జీవీ చేయాల్సింది కానీ వద్దనేశాడనమాట.
ఇకపోతే 'ఇడ్లీ కొట్టు' సినిమా.. పూర్తిగా ఎమోషన్స్ బేస్ చేసుకుని తీశారు. ధనుష్, నిత్యామేనన్, సత్యరాజ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే లీడ్ రోల్స్ చేశారు. దసరా కానుకగా తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దీనికి ఐదు రోజుల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ', ఓ రోజు తర్వాత 'కాంతార' సీక్వెల్ విడుదల కానున్నాయి. మరి వీటితో నిలబడి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: రూ.100 కోట్లకు చేరువలో 'మిరాయ్' కలెక్షన్)