
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అందుకు తగ్గట్లే కలెక్షన్ కూడా వస్తోంది. తొలిరోజు ఓ మాదిరి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం.. రెండు, మూడో రోజు మాత్రం కాస్త ఎక్కువగానే వసూలు చేసింది. వీకెండ్ పూర్తయ్యేసరికి మంచి నంబర్స్ నమోదు చేసింది. ఇంతకీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయ్? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)
'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన 'మిరాయ్'కి తొలి నుంచి కాస్త హైప్ ఏర్పడింది. కంటెంట్ పరంగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా విజువల్స్ పరంగా ఆకట్టుకోవడంతో పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. అలా తొలిరోజు రూ.27.20 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు వచ్చేసరికి రూ.55.60 కోట్లకు చేరింది. ఆదివారం మంచి ఆక్యుపెన్సీలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజులకు కలిపి రూ.81.2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరువలో వసూళ్లు ఉన్నాయి. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ విషయంలో కాస్త డ్రాప్ ఉంటుంది. ప్రేక్షకులు కాస్త తక్కువగానే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. మరి 'ఓజీ' రావడానికి ఇంకా 10 రోజులకు పైనే టైమ్ ఉంది. మరి అంతలోపు 'మిరాయ్' ఎన్ని కోట్లు అందుకుంటుందో చూడాలి? ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఇది కూడా 'మిరాయ్'కి ప్లస్ కావొచ్చేమో?
(ఇదీ చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్)
From South to North, from India to Overseas, #MIRAI is rewriting history everywhere ❤️🔥
Record Breaking ₹81.2 Cr Gross Worldwide in just 3 DAYS for #BrahmandBlockbusterMirai 💥💥💥
India’s most ambitious action adventure is now the most celebrated film across the globe🔥
—… pic.twitter.com/7MqeKGvWwV— People Media Factory (@peoplemediafcy) September 15, 2025