ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే | Upcoming OTT Movies Telugu September 3rd Week 2025 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లో ఒక్క వారం 15 మూవీస్ స్ట్రీమింగ్

Sep 15 2025 7:40 AM | Updated on Sep 15 2025 8:03 AM

Upcoming OTT Movies Telugu September 3rd Week 2025

మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్లలో మిరాయ్, కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్ అలరిస్తున్నాయి. ఈ వీకెండ్ చాలానే సినిమాలు రాబోతున్నాయి. మంచు లక్ష‍్మీ 'దక్ష', బ్యూటీ, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు తదితర తెలుగు చిత్రాలతో పాటు భద్రకాళి, వీరచంద్రహాస, టన్నెల్ తదితర డబ్బింగ్ మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. అయితే వీటిలో దేనిపైనా ఏ మాత్రం హైప్ లేదు. వీటిలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)

మరోవైపు ఓటీటీల్లో 15కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 28 ఇయర్స్ లేటర్, ఎలియో, ఇంద్ర, హౌస్ మేట్స్ తదితర మూవీస్‌తో పాటు ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్, ష్ సీజన్ 2, ద ట్రయల్ సీజన్ 2 సిరీస్‌లు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 15 నుంచి 21 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 18

  • 28 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 20

అమెజాన్ ప్రైమ్

  • జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17

  • బెలెన్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 18

హాట్‌స్టార్

  • ఎలియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 17

  • సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 18

  • పోలీస్ పోలీస్ (తమిళ సిరీస్) - సెప్టెంబరు 19

  • ద ట్రయల్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 19

  • స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19

సన్ నెక్స్ట్

  • ఇంద్ర (తమిళ సినిమా) - సెప్టెంబరు 19

  • మాటొండ హెలువే (కన్నడ మూవీ) - సెప్టెంబరు 19

ఆహా

  • ష్ సీజన్ 2 (తెలగు సిరీస్) - సెప్టెంబరు 19

జీ5

  • హౌస్‌మేట్స్ (తమిళ సినిమా) - సెప్టెంబరు 19

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద మార్నింగ్ షో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17

లయన్స్ గేట్ ప్లే

  • ద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19

(ఇదీ చదవండి: శేఖర్ కమ్ముల హిట్ మూవీ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement