
థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్'.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతటా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే సూపర్ హీరో తరహా జానర్‌లో మూవీ తీసినప్పటికీ.. క్లైమాక్స్‌లో శ్రీ రాముడి రిఫరెన్స్ చూపించడం ప్రేక్షకులకు నచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ఈ పాత్రలో ప్రభాస్ నటించాడని.. మూవీ రిలీజ్‌కి ముందు రూమర్స్ వచ్చాయి. కానీ ఆ పాత్రని ఓ యువ నటుడితో చేయించారు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు? అతడి డీటైల్స్ ఏంటి?
ఈ సినిమా చివరలో వచ్చే శ్రీ రాముడి పాత్ర.. కథని టర్న్ అయ్యేలా చేస్తుంది. పట్టుమని ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఆ పాత్రని చూపించారు. అది కూడా ముఖం కనిపించీ కనిపించకుండా చూపించారు. దీంతో ఆ పాత్రని ఎవరు చేశారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ రోల్లో హిందీ నటుడు గౌరవ్ బోరా కనిపించాడు. ఇతడిది ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్. మాస్ కమ్యూనికేషన్ చదివిన గౌరవ్.. నటనపై ఇష్టంతో ఢిల్లీ వచ్చేసి థియేటర్ గ్రూప్‌లో చేరాడు. ఐదేళ్ల పాటు పలు నాటకాలు చేశాడు.
(ఇదీ చదవండి: ‘మిరాయ్’ మూవీ రివ్యూ)
పలు షార్ట్ ఫిల్మ్స్, హిందీ సీరియల్స్ కూడా చేసిన గౌరవ్.. కొన్ని కమర్షియల్ యాడ్స్‌లోనూ నటించాడు. మరి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఎక్కడ చూశాడో ఏమో గానీ గౌరవ్‌ని శ్రీరాముడి పాత్ర కోసం ఎంపిక చేశాడు. రెండు రోజుల పాటు ఇతడికి సంబంధించిన షూటింగ్ అంతా జరిగింది. శ్రీ రాముడి సీన్స్‌కి వీఎఫ్ఎక్స్ కూడా జోడించేసరికి ఆ సన్నివేశాలు ఎలివేట్ అవుతున్నాయి.
అయితే తెలుగులో శ్రీరాముడు అంటే చాలామంది సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు. తర్వాత కాలంలో పలువురు నటులు.. ఈ పాత్రలో కనిపించినప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఒకవేళ 'మిరాయ్' టీమ్ ఎవరైనా తెలుగు నటుడిని ఈ పాత్రలో పెట్టుంటే కచ్చితంగా పోలిక వచ్చి ఉండేది. అందుకేనేమో ఉత్తరాది నటుడిని పెట్టి మేనేజ్ చేసినట్లు అనిపిస్తుంది. ఏదైనా ఈ పాత్రకు కూడా రెస్పాన్స్ బాగానే వస్తుండటం విశేషం.
(ఇదీ చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే!)