
మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించగా, రితికా నాయక్ హీరోయిన్‌గా చేసింది. శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు.
రికార్డులు తిరగరాయడం ఖాయం
మిరాయ్‌కు తొలి రోజే రూ.27 కోట్లు రావడంతో చిత్రయూనిట్ 'బ్రహ్మాండ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్' పేరిట విజయోత్సవాలు జరుపుకుంది. సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే మిరాయ్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తన గొంతు అరువిచ్చాడు. సినిమా ప్రారంభంలో ప్రభాస్ గొంతు వినిపించగానే ప్రేక్షకులు ఎగిరిగంతేస్తున్నారు. మిరాయ్ మూవీకి అంత బూస్ట్ ఇచ్చిన ప్రభాస్ దీనికోసం ఎంత డబ్బు తీసుకున్నాడని కొందరు చర్చలు మొదలుపెట్టారు.
ఓటీటీ పార్ట్‌నర్
అసలే ప్రభాస్‌ది వెన్నలాంటి మనసు. తన వల్ల సినిమాకు ప్లస్ అవుతుందంటే సరేనని గొంతు అరువిచ్చి సాయం చేశాడే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోలేదట! దీంతో రెబల్ స్టార్‌ను అభిమానులు మరోసారి ఆకాశానికెత్తేస్తున్నారు. ఇకపోతే మిరాయ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. నెల రోజుల తర్వాతే మిరాయ్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయి. అంటే అక్టోబర్ నెలలో మిరాయ్ ఓటీటీలో ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది.
చదవండి: ప్యారడైజ్‌లో విలన్‌గా మోహన్‌బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి