
ఎప్పుడూ ఏదో ఒకరకమైన గొడవలతో మంచు ఫ్యామిలీ నిత్యం వార్తల్లో ఉండేది. కానీ, ఈ మధ్య సినిమాల అప్‌డేట్స్‌తో మాత్రమే వార్తల్లో నిలుస్తోంది. మొన్నామధ్య విష్ణు 'కన్నప్ప', నిన్న మనోజ్ 'మిరాయ్', నేడు లక్ష్మి, మోహన్‌బాబుల 'దక్ష' సినిమాల అప్‌డేట్స్ నడుస్తున్నాయి. చూస్తుంటే మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. కన్నప్పలో విష్ణు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
రిలీజ్‌కు రెడీ అయిన దక్ష
పుష్కరకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్‌కు మిరాయ్‌తో భారీ విజయం దక్కింది. మంచు లక్ష్మి కూడా తన తమ్ముళ్లలాగే మంచి హిట్ కొట్టాలన్న కసితో దక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఓ సీక్రెట్‌ను బయటపెట్టేసింది.
అలా అనుకుంటే జీవితం నరకం
'మనోజ్ కమ్‌బ్యాక్ నాకు ఇన్‌స్పిరేషన్. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తుంటాయి. అవి ముగిసిపోతే బాగుండు అని అందరూ అనుకుంటారు. కానీ, జీవితం ఇంతే అనుకుంటే నరకం.. జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. మనోజ్.. ఎంతో మనోవేదనను దాటుకుని ఇంతదూరం వచ్చాడు. అయితే మనోజ్‌కు, నాకు వయసవుతుంది.. కానీ, మా నాన్నకు వయసవ్వడం లేదు. ఆయన ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు.
లీక్ చేసిన మంచు లక్ష్మి
(అంతలోనే నాలుక్కరుచుకున) అఫీషియల్‌గా వచ్చిందా? లేదా నేనే లీక్ చేశానా? సరే పోనీ.. నాని ఏమీ అనుకోడు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఫోటోలు తీసుకునేటప్పుడు.. తన లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. శారీరక వ్యాయామాలు చేస్తున్నాడు. ఈ వయసులో చాలామంది యాక్టర్స్ ఏదో రెండు గంటలు పని చేసి, నేను ఇంతకంటే ఎక్కువ చేయను అని బిల్డప్ ఇస్తుంటారు.
చాలాకాలం తర్వాత విలన్‌గా
కానీ, నాన్నగారు అలా చేయరు. ఆయన సెట్స్‌కు వస్తే ఒక చిన్నబిడ్డలా ప్రవర్తిస్తారు. పెద్ద డైరెక్టర్ అయినా, కొత్త డైరెక్టర్ అయినా అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలామందికి ఇన్‌స్పిరేషన్' అని లక్ష్మీ మంచు చెప్పుకొచ్చింది. కాగా దసరా తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! దీనికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చాలాకాలం తర్వాత ఈ సినిమా కోసం మోహన్‌బాబు విలన్‌గా నటించనున్నారని ప్రచారం జరిగింది. మంచు లక్ష్మి కామెంట్స్‌తో ఇప్పుడది నిజమని రుజువైంది.
చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా?