
శేఖర్ కమ్ముల పేరు చెప్పగానే యూత్‌ఫుల్ సినిమాలే గుర్తొస్తాయి. తను తీసిన మూవీస్‌తో చాలామంది కొత్తవాళ్లని నటీనటులుగా పరిచయం చేశాడు. అయితే వారిలో నిలబడి స్టార్స్ అయినవాళ్లు కొందరైతే.. క్రేజ్ వచ్చినా సరే దాన్ని నిలబెట్టుకోలేకపోయిన వాళ్లు మరికొందరు. ఈ బ్యూటీ కూడా రెండో టైప్. ఈమె ఎవరు? తెలుగులో ఏ మూవీస్‌లో నటించింది? ఇప్పుడేం చేస్తోంది?
పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు జరా షా. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈమె మోడలింగ్ చేసింది. మంచి పేరు తెచ్చుకుంది. అలా దర్శకుడు శేఖర్ కమ్ముల దృష్టిలో పడటంతో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో ఓ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. నాగరాజు పాత్రకు లవ్ ఇంట్రెస్ట్ లక్ష‍్మిగా నటించింది. ఈ జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. అలా ఈమెకు నాగార్జున 'భాయ్', అనుష్క 'రుద్రమదేవి' చిత్రాల్లో నటించే అవకాశమొచ్చింది.
(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)
అలానే పైరేట్స్ 1.0, ఐతే 2.0 అనే తెలుగు సినిమాల్లోనూ జరా షా నటించింది. కానీ తొలి సినిమాతో వచ్చిన గుర్తింపు తర్వాత తగ్గిపోయింది. చేసిన మూవీస్ ఫెయిల్ కావడంతో ఈమె పూర్తిగా నటనని పక్కనబెట్టేసింది. అలానే మోడలింగ్ కూడా చేస్తున్నట్లు లేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అడపాదడపా ఫొటోలు పోస్ట్ చేస్తోంది. సినిమాలో పాత్రకు ప్రస్తుతం ఈమెని చూస్తే కచ్చితంగా పోల్చలేరు. అంతలా డిఫరెన్స్ కనిపిస్తుంది. తాజాగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాకు 13 ఏళ్లు పూర్తయిందని పోస్టర్ షేర్ చేయడంతో ఈమె మరోసారి టాపిక్ అయింది.
ఇకపోతే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో లీడ్ రోల్స్ చేసిన అభిజిత్, సుధాకర్, జరా షా తదితరులు తర్వాత కాలంలో కనుమరుగైపోయారు కానీ ఇదే మూవీలో విలన్ గ్యాంగ్ వైపు కనిపించిన నవీన్ పొలిశెట్టి, విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, శ్రీముఖి తదితరులు పెద్ద స్టార్స్ అయిపోయారు. ఇదే మూవీలో ఈషా రెబ్బా, శ్రీ విష్ణు కూడా నటించారు. ఇప్పుడు వీళ్లు హీరోహీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్)
