
తెలుగులో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్.. శుభవార్త చెప్పేసింది. ఈ ఏడాది మొదట్లో ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో సహ నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: రెండోసారి ప్రసవం.. చాలా ఇబ్బందిపడ్డా: ఇలియానా)
'దేవాన్ కే దేవ్ మహాదేవ్' సీరియల్‌లో పార్వతి దేవిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి సోనారిక.. దస్తాన్ ఈ మొహబ్బత్ సలీమ్ అనార్కలీ సీరియల్ కూడా చేసింది. మరో రెండు మూడింటిలోనూ కనిపించింది. బుల్లితెరకే ఈమె పరిమితమైపోలేదు. తెలుగులో 'జాదుగాడు', స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లోనూ హీరోయిన్‌గా చేసింది. కానీ ఇవి హిట్ కాకపోవడంతో టాలీవుడ్‌లో కనిపించలేదు. చివరగా 2022లో 'హిందుత్వ' అనే హిందీ మూవీ చేసింది.
2022లోనే సోనారిక తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశార్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైపోయింది. దాదాపు ఏడేనిమిదేళ్లుగా ప్రేమించుకున్న వీళ్లిద్దరూ 2022లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని బయటపెట్టారు. మాల్దీవులు వెళ్లి మరీ బేబీ బంప్‌తో ఫొటోలు దిగారు. వీటినే సోనారిక ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. అందరి నుంచి విషెస్ వస్తున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా)

