breaking news
Sonarika Bhadauria
-
బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
తల్లయిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటో వైరల్
అప్పట్లో సీరియల్ పార్వతి దేవిగా గుర్తింపు తెచ్చుకున్న సోనారిక.. శుభవార్త చెప్పేసింది. తాను కూతురికి జన్మనిచ్చినట్లు బయటపెట్టింది. ఈ మేరకు ఓ ఫొటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో తోటి నటీనటులు, నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ 9 తనూజ చెల్లి.. ఫోటో వైరల్)'దేవాన్ కే దేవ్ మహాదేవ్' అనే సీరియల్లో పార్వతి దేవిగా నటించిన సోనారిక.. దేశవ్యాప్తంగా మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. అలా మరో రెండు మూడు సీరియల్స్‌లో నటించింది. తర్వాత తెలుగులోనూ 'జాదుగాడు' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 'స్పీడున్నోడు', 'ఈడోరకం ఆడోరకం' సినిమాల్లో మంచు విష్ణుకి జోడీగా చేసింది. కానీ ఇవి హిట్ కాకపోవడంతో టాలీవుడ్లో మళ్లీ కనిపించలేదు. చివరగా 2022లో 'హిందుత్వ' అనే హిందీ మూవీ చేసింది.చివరగా సినిమా చేసిన ఏడాదిలోనే వ్యాపారవేత్త వికాస్ పరశార్‌తో నిశ్చితార్థం చేసుకుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి గతేడాది పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసిన సోనారిక.. కొన్ని నెలల క్రితం ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు డిసెంబరు 5న తనకు ఆడబిడ్డ పుట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: 60 ఏళ్లకు లవ్‌లో పడాలనుకోలే.. కానీ తనను చూడగానే: ఆమిర్ ఖాన్) View this post on Instagram A post shared by Sonarika Bhadoria (@bsonarika) -
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్.. శుభవార్త చెప్పేసింది. ఈ ఏడాది మొదట్లో ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో సహ నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: రెండోసారి ప్రసవం.. చాలా ఇబ్బందిపడ్డా: ఇలియానా)'దేవాన్ కే దేవ్ మహాదేవ్' సీరియల్లో పార్వతి దేవిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి సోనారిక.. దస్తాన్ ఈ మొహబ్బత్ సలీమ్ అనార్కలీ సీరియల్ కూడా చేసింది. మరో రెండు మూడింటిలోనూ కనిపించింది. బుల్లితెరకే ఈమె పరిమితమైపోలేదు. తెలుగులో 'జాదుగాడు', స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. కానీ ఇవి హిట్ కాకపోవడంతో టాలీవుడ్లో కనిపించలేదు. చివరగా 2022లో 'హిందుత్వ' అనే హిందీ మూవీ చేసింది.2022లోనే సోనారిక తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశార్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైపోయింది. దాదాపు ఏడేనిమిదేళ్లుగా ప్రేమించుకున్న వీళ్లిద్దరూ 2022లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని బయటపెట్టారు. మాల్దీవులు వెళ్లి మరీ బేబీ బంప్‌తో ఫొటోలు దిగారు. వీటినే సోనారిక ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. అందరి నుంచి విషెస్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా) -
టీవీ నటి సోనారిక లేటెస్ట్ పిక్స్..
-
పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా?
మీరు ప్రముఖమైన టీవీ నటులా? అయితే సోషల్ మీడియలో ఫొటోలు పెట్టే విషయంలో కాస్తా జాగ్రత్త ఉండండి! ఎందుకు అంటారా? ఈ విషయాన్ని సోనారికా భడోరియాను అడిగితే.. ఆమె బాగా చెప్పగలదు. 'దేవోన్ కా దేవ్ మహదేవ్' సీరియల్లో ఆమె పార్వతి పాత్రలో నటించింది. పార్వతిగా ఆమె ప్రేక్షకుల మదిలో ముద్రపడినట్టు ఉంది. ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకొని ఇప్పటికీ మూడేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విహారయాత్రకు వెళ్లిన ఆమె కొన్ని ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. నీలి అలల తీరంలో సముద్ర ఒడ్డున ఆమె బికినీలో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. దీనిపై కొందరు ఆమె అభిమానులు నొచ్చుకున్నారు. ఇదేమిటి? శివుడి ఇల్లాలైన పార్వతీదేవిగా ఎంతో పవిత్రమైన పాత్రలో కనిపించి.. ఇప్పుడిలా కురచ దుస్తులు వేసుకోవడమేమిటని పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె తీరును తప్పుబడుతూ విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. దీంతో సోనిరిక స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 'నేను ఏ ప్రపంచంలో ఉన్నానో తెలియడం లేదు. పాశ్చాత్య దేశాల్లో బాడీషేమింగ్ (శరీరాకృతి గురించి విమర్శలు చేయడం)కు వ్యతిరేకంగా పోరాడుతుండగా ఇక్కడ బాడీ షేమింగ్ మాట పక్కనపెట్టండి. కనీసం బికినీ వేసుకున్నన్నా నేరంగా పరిగణిస్తున్నారు. కొన్ని నిమిషాల కిందట నేను బికినీలో దిగిన కొన్ని ఫొటోలను పెట్టాను. వాటిపై వస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు, శాపనార్థాలు తట్టుకోలేక వాటిని డిలీట్ చేస్తున్నాను. వాటన్నింటినీ నేను విస్మరించవచ్చు. కానీ అంత ప్రతికూలతను భరించే పరిపక్వత నాకు రాలేదు. అందుకే ఫొటోలను తీసేశాను' అని ఆమె పేర్కొన్నారు.


