అప్పట్లో సీరియల్ పార్వతి దేవిగా గుర్తింపు తెచ్చుకున్న సోనారిక.. శుభవార్త చెప్పేసింది. తాను కూతురికి జన్మనిచ్చినట్లు బయటపెట్టింది. ఈ మేరకు ఓ ఫొటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో తోటి నటీనటులు, నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ 9 తనూజ చెల్లి.. ఫోటో వైరల్)
'దేవాన్ కే దేవ్ మహాదేవ్' అనే సీరియల్‌లో పార్వతి దేవిగా నటించిన సోనారిక.. దేశవ్యాప్తంగా మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. అలా మరో రెండు మూడు సీరియల్స్‌లో నటించింది. తర్వాత తెలుగులోనూ 'జాదుగాడు' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'స్పీడున్నోడు', 'ఈడోరకం ఆడోరకం' సినిమాల్లో మంచు విష్ణుకి జోడీగా చేసింది. కానీ ఇవి హిట్ కాకపోవడంతో టాలీవుడ్‌లో మళ్లీ కనిపించలేదు. చివరగా 2022లో 'హిందుత్వ' అనే హిందీ మూవీ చేసింది.
చివరగా సినిమా చేసిన ఏడాదిలోనే వ్యాపారవేత్త వికాస్ పరశార్‌తో నిశ్చితార్థం చేసుకుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి గతేడాది పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసిన సోనారిక.. కొన్ని నెలల క్రితం ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు డిసెంబరు 5న తనకు ఆడబిడ్డ పుట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: 60 ఏళ్లకు లవ్‌లో పడాలనుకోలే.. కానీ తనను చూడగానే: ఆమిర్ ఖాన్)


