'మన శంకర వరప్రసాద్‌గారు' స్టోరీ.. ఈ మూవీ నుంచే తీసుకున్నా: అనిల్‌ | Anil Ravipudi Comments ON Mana shankara vara prasad garu story reference | Sakshi
Sakshi News home page

'మన శంకర వరప్రసాద్‌గారు' స్టోరీ.. ఈ మూవీ నుంచే తీసుకున్నా: అనిల్‌

Jan 25 2026 9:42 AM | Updated on Jan 25 2026 10:15 AM

Anil Ravipudi Comments ON Mana shankara vara prasad garu story reference

చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికీ దూసుకుపోతుంది. అయితే, మూవీ చూసిన తర్వాత చాలామంది అనేక విమర్శలు చేశారు. ఈ మూవీ డాడీ, విశ్వాసం, తులసి సినిమాలకు దగ్గరగా ఉందంటూ  కామెంట్‌లు చేశారు. ఆ మూడు కథలను బేస్‌ చేసుకుని ‘మన శంకర వరప్రసాద్ గారు’ స్క్రిప్ట్‌ను రెడీ చేశారంటూ నెట్టింట పోస్టులు షేర్‌ చేశారు. అయితే,  ఈ అంశంపై తాజాగా దర్శకుడు అనిల్‌ రావిపూడి అసలు విషయం చెప్పారు.

మన శంకర వరప్రసాద్ గారు స్టోరీపై వస్తున్న విమర్శలకు దర్శకుడు అనిల్ రావిపూడి ఇలా స్పందించాడు. 'అజిత్‌ నటించిన 'విశ్వాసం' మూవీ ఛాయలు మన శంకర వరప్రసాద్‌ గారు చిత్రంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి తప్పులేదు.  ఎందుకంటే..? ఈ రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నయనతార నటించారు. విశ్వాసం మూవీ కథను పాప పాత్ర టర్న్‌ చేస్తుంది. వాస్తవానికి అలాంటి కాన్సెప్ట్‌ కథతో తెలుగులో 'డాడీ' మూవీ  ఎప్పుడో వచ్చింది. నేను 'డాడీ' మూవీని రిఫరెన్స్‌గా తీసుకునే 'మన శంకర వరప్రాద్‌'ను తెరకెక్కించాను. డాడీ మూవీలో చిరు ఎమోషన్స్‌ బాగా పండించారు. కానీ, సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. 

డాడీ స్టోరీ చుట్టూ ఒక బలమైన కోటరి లేకపోవడంతోనే ప్రేక్షకులను మెప్పించలేదని నా అభిప్రాయం. అయితే, డాడీ మూవీ నాకు బాగా నచ్చింది. అందులోని ప్రధానమైన కాన్సెప్ట్‌ను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. ఇందులో దాచేది ఏం లేదు. ఓపెన్‌గానే చెబుతున్నాను. మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి మూలం 'డాడీ' స్టోరీనే..' అంటూ అనిల్‌ హూందాగా చెప్పారు. ఈ విషయంలో అనిల్‌ను మెచ్చుకోవాల్సింది. తను నిజాయితీగానే క్లారిటీ ఇచ్చాడు. అయితే, ఫ్యామిలీ పల్స్‌ బాగా పట్టేసుకున్న అనిల​్‌ తనదైన స్టైల్లో మన శంకర వరప్రసాద్‌ గారు కథన సిద్ధం చేసుకున్నారు. ఆయన చెప్పినట్లుగా కేవలం డాడీ మూవీ కాన్సెప్ట్‌ను మాత్రమే తీసుకున్నారు. కానీ, కథలో చిరు అభిమానులకు కావాల్సినంత స్టఫ​్‌ను అనిల్‌ ఇచ్చారు. అందుకే సినిమా సూపర్‌ హిట్‌ అయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement