మైత్రీ మూవీస్‌ చేతిలో బిగ్‌బాస్‌ 'అమర్‌దీప్' సినిమా | Amardeep Chowdary movie Sumathi Satakam release by mythri movies | Sakshi
Sakshi News home page

మైత్రీ మూవీస్‌ చేతిలో బిగ్‌బాస్‌ 'అమర్‌దీప్' సినిమా

Jan 25 2026 7:43 AM | Updated on Jan 25 2026 7:43 AM

Amardeep Chowdary movie Sumathi Satakam release by mythri movies

బిగ్‌బాస్‌ అమర్‌దీప్, సైలీ జంటగా నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. తాజాగా ఈ మూవీ నుంచి  'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పాటకు సుభాష్‌ ఆనంద్‌ సంగీతం అందించగా.. కృష్ణ మాదినేని రచించారు. సింగర్‌ గోల్డ్‌ దేవరాజ్‌ ఆలపించారు. అయితే, ఈ సాంగ్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యేలా సాంగ్‌ ఉంది. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో ఎమ్‌ఎమ్‌ నాయుడు దర్శకత్వంలో  సాయి సుధాకర్‌ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా మైత్రీ మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ఓ మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిలా అమర్‌దీప్‌ కనిపిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement