హీరోయిన్‌గా జీవీ ప్రకాష్‌ సోదరి.. కొత్త సినిమా విడుదల | GV Prakash Kumar Sister Bhavani Sre movies released now | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌గా జీవీ ప్రకాష్‌ సోదరి.. కొత్త సినిమా విడుదల

Jan 25 2026 7:12 AM | Updated on Jan 25 2026 7:23 AM

GV Prakash Kumar Sister Bhavani Sre movies released now

ఏ నటి, నటుడైనా ఒకే రకం మూస పాత్రల్లో నటించడానికి ఇష్టపడరు. వైవిధ్య భరిత కథా పాత్రలు లభిస్తేనే తమ ప్రతిభను చాటుకునే అవకాశం కలుగుతుంది. అలా వైవిధ్య భరిత కథా పాత్రలతో వర్ధమాన నటి భవానిశ్రీ (Bhavani Sre)ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు మేనకోడలు అని తెలిసిందే.. మరో ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌కు సోదరి అవుతుంది. అయితే,  ఈమె నటించింది కొన్ని చిత్రాలే అయినప్పటికీ నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలను ఎంపిక చేసుకుంటుంది.

ఆ మధ్య వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందిన విడుదలై చిత్రంలో కొండవాసి యువతిగా నటించి అందరి ప్రశంసలు పొందారు. తాజాగా హాట్‌స్పాట్‌ 2మచ్‌ చిత్రంలో హైలీ మోడరన్‌ యువతిగా నటించడం విశేషం. విగ్నేష్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నటించిన అనుభవాన్ని భవానిశ్రీ  పంచుకుంటూ హాట్‌స్పాట్‌ 2మచ్‌ చిత్రం ద్వారా తొలిసారిగా లైట్‌ హార్టెడ్‌ సినిమాలోకి అడుగుపెట్టానని పేర్కొన్నారు. ఇంతకుముందు చాలా తీవ్రమైన, సీరియస్‌ కథా పాత్రలలో నటించిన తాను హాట్‌స్పాట్‌ 2మచ్‌ చిత్రం తనకు ఒక మంచి మార్పుగా అనిపించిందన్నారు. 

ఇది వినోదభరితమైన లైట్‌ హార్టెడ్‌ కథా చిత్రం అని చెప్పారు. జెన్‌ 2 తరానికి చెందిన ఆధునిక అనుబంధాలతో, చిన్న చిన్న ఫాంటసీ సన్నివేశాలతో సాగే ప్రేమ కథ చిత్రం గా రూపొందిన చిత్రం ఇది అని చెప్పారు. దర్శకుడు విఘ్నేష్‌ కార్తీక్‌ ఇంతకుముందు తెరకెక్కించిన చిత్రాలను తను చూస్తూ వచ్చానని, తిట్టం రెండు, ప్లాన్‌ బి వంటి విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన ఆయన హాట్‌స్పాట్‌ 2మచ్‌ చిత్రంలో నటించే అవకాశాన్ని తనకు కలి్పంచినప్పుడు తాను చాలా నూతనోత్సాహానికి గురైనట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటుడు అశ్విన్‌తో కలిసి నటించడం చాలా సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై కూడా సరికొత్త కథా పాత్రల్లో నటించడానికే ఇష్టపడుతున్నట్లు నటి భవానిశ్రీ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement