అకీరా నందన్‌పై వీడియో క్రియేట్‌.. కాకినాడలో అరెస్ట్‌ | Pawan kalyan son akira nandan son accused person arrested | Sakshi
Sakshi News home page

అకీరా నందన్‌పై వీడియో క్రియేట్‌.. కాకినాడలో అరెస్ట్‌

Jan 25 2026 8:04 AM | Updated on Jan 25 2026 8:04 AM

Pawan kalyan son akira nandan son accused person arrested

సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌పై  ఏఐ వీడియో క్రియేట్‌ చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోషల్‌మీడియాలో తన పేరుతో పాటు ఫోటోలను ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అకీరా నందన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అకీరా నందన్ అనుమతి లేకుండా ఏఐ సాయంతో 56 నిమిషాల  ఒక వీడియోను క్రియేట్‌ చేసి.. దానిని యూట్యూబ్‌లో విడుదల చేశారు. 

పోలీసుల విచారణలో కూడా తప్పుడు రీతిలో డీప్‌ఫేక్ కంటెంట్ తయారు చేసినట్లు వెల్లడైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీలతో పాటు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా కామన్‌ వ్యక్తులకు సంబంధించిన ఫేక్ వీడియోలు క్రియేట్‌ చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement