60 ఏళ్లకు లవ్‌లో పడాలనుకోలే.. | Aamir Khan: Three Women Have Greatly Shaped his LifeAAA | Sakshi
Sakshi News home page

ప్రేమకోసం పాకులాడలేదు.. ఆమె దొరకడం నా అదృష్టం

Dec 7 2025 2:19 PM | Updated on Dec 7 2025 2:58 PM

Aamir Khan: Three Women Have Greatly Shaped his LifeAAA

అరవై ఏళ్లకు ఎవరైనా రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచిస్తారు. కానీ సినిమా హీరోలు మాత్రం యంగ్‌ హీరోలకు పోటినిచ్చేలా ఎలాంటి సినిమాలు తీయాలన్న ప్లానింగ్‌లో ఉంటారు. బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ ఆ పనితో పాటు మరో పనిలో కూడా ఉన్నాడు. గౌరీ స్ప్రాట్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా వెల్లడించాడు.

మూడోసారి ప్రేమలో..
రెండు పెళ్లిళ్లు - విడాకుల తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డానని తెలిపాడు. కానీ ఈ ఏజ్‌లో లవ్‌లో పడతానని అస్సలు ఊహించలేదని, ప్రేమ కోసం పాకులాడలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ వేదికపై ఆమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. నేను మళ్లీ రిలేషన్‌షిప్‌లో అడుగుపెడతానని అస్సలు అనుకోలేదు. కానీ గౌరీ నా జీవితంలో చాలా ప్రశాంతతను, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. తనొక అద్భుతమైన వ్యక్తి. తనను కలవడమే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 

గొడవల్లేవ్‌
వైవాహిక బంధంలో సక్సెస్‌ అవకపోయినప్పటికీ మాజీ భార్యలు రీనా, కిరణ్‌లను కలుస్తూ ఉంటాను. ఇప్పుడు గౌరీ కూడా యాడ్‌ అయింది. నేను వ్యక్తిగా ఎదిగేందుకు వీళ్లంతా చాలా దోహదపడ్డారు. అందుకు నేను వారిని ఎంతో గౌరవిస్తాను. రీనా దత్తాతో నేను విడిపోయిన‍ప్పటికీ మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మంచి స్నేహితులుగా కలిసే ఉంటాం. 

ఫస్ట్‌ పెళ్లి
కిరణ్‌ విషయంలోనూ అంతే.. తను కూడా ఎంతో అద్భుతమైన వ్యక్తి. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా మాత్రం కలిసే ఉన్నాం. రీనా.. ఆమె పేరెంట్స్‌, కిరణ్‌.. ఆమె పేరెంట్స్‌.. నా తల్లిదండ్రులు.. అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఆమిర్‌ ఖాన్‌.. 1986లో రీనా దత్తాను పెళ్లాడాడు. వీరికి జునైద్‌ ఖాన్‌, ఇరా ఖాన్‌ సంతానం. 

రెండో పెళ్లి
కొంతకాలానికి దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2022లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్‌ (Aamir Khan).. 2005లో కిరణ్‌ రావును పెళ్లి చేసుకున్నాడు . వీరికి కుమారుడు ఆజాద్‌ సంతానం. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడు.

చదవండి: తనూజ చెల్లి వివాహం.. ఫోటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement