టాలీవుడ్ నటుడు నారా రోహిత్, నటి శిరీష (సిరి)ల వివాహం గతేడాది అక్టోబర్‌లో ఘనంగా జరిగింది. ప్రతినిధి 2 సినిమాలో వారిద్దరూ కలిసి నటించారు. అలా మొదలైన వారి పరిచయం పెళ్లి వరకు చేరుకుంది. పెద్దల అంగీకారంతో హైదరాబాద్‌లో వారి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా వారి వివాహానికి సంబంధించిన వీడియోను ఒక ఫోటోగ్రఫీ సంస్థ తమ యూట్యూబ్‌లో షేర్ చేసింది. శిరీష స్వస్థలం ఏపీలోని రెంటచింతల గ్రామం.. తమ తల్లిదండ్రులకు నాలుగో సంతానమైన శిరీష ఆస్ట్రేలియాలో చదువుకుంది. సినిమాలపై మక్కువతో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.


