
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. కూలీ, పరదా, సయారా, సు ఫ్రమ్ సో.. ఇలా చాలా హిట్ చిత్రాలు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ కూడా రీసెంట్‌గానే డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల వచ్చే ఇబ్బందులు అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
గత కొన్నేళ్లలో తెలుగులో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్.. లీడ్ రోల్ చేసిన సినిమా 'బకాసుర రెస్టారెంట్'. ఆగస్టు తొలివారం థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాంటిది నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్‍లోకి వచ్చేసింది. ఈ సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాంటిది ఈ చిత్రం ఇప్పుడు సదరు ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది.
(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఉద్యోగం చేస్తుంటాడు కానీ వ్యాపారం చేయాలని కోరిక. దీంతో రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ మొదలుపెడతాడు. ఓ దెయ్యంపై తొలి వీడియో చేస్తే అది తెగ వైరల్ అవుతుంది. అలాంటిదే మరో వీడియో చేసేందుకు ఓ పాత బంగ్లాకు తన స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తాడు. కట్ చేస్తే బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.
బక్క సూరి ఆత్మతో పరమేశ్వర్, అతడి స్నేహితులు ఆడుకునే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దీనికి ఆకలికి ఎక్కువ. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్? ప్రోమో రిలీజ్)
