'దండోరా' సినిమా టైటిల్ గీతాన్ని శనివారం విడుదల చేశారు. మార్క్ కె రాబిన్ సంగీతమందించాడు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల బాధలను తెలియజేసేలా సాగే ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది. తరాలు మారుతున్నాయి. చంద్రుడిపైకి మనిషి అడుగు పెట్టిన ఎన్నో ఏళ్లవుతుంది. అయినా కూడా ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదనేది ఈ పాటలోని భావం.
(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)
కలర్ ఫోటో, బెదురులంక 2012 సినిమాలని నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తీసింది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 23నే ప్రీమియర్స్ ఉండనున్నాయి.
(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్)


