
బిగ్‌బాస్ 9లో ఐదు రోజులు విజయవంతంగా పూర్తయింది. అలానే వీకెండ్ వచ్చేసింది. దీంతో హోస్ట్ నాగార్జున.. హౌస్‌మేట్స్ ముందుకు వచ్చేశారు. ఓవైపు అందరినీ సరదాగా నవ్విస్తూనే మరోవైపు తనదైన స్టైల్లో కౌంటర్స్ వేశారు. ఈసారి కెప్టెన్ సంజనకి కాస్త గట్టిగానే పంచులు పడ్డాయి. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.
తొలివారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో ప్రస్తుతం నడుస్తోంది. మరోవైపు శనివారం ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందా అనేది ప్రోమోతో కాస్త క్లారిటీ ఇచ్చారు. వస్తూవస్తూనే అందరిని పలకరించిన నాగార్జున.. రాము రాథోడ్ బట్టలు ఉతకడం గురించి, ఇమ్మాన్యుయేల్.. హరీశ్‌ని గుండంకుల్ అనడం గురించి పంచులు వేశారు. అలానే సంజన.. ఫ్లోరా రిలేషన్ గురించి కల్పించుకోవడంపైన స్పందించారు.
(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
రాము రాథోడ్‌కి తన రిలేషన్ టాపిక్ గురించి చెబుతుంటే మధ్యలో వచ్చిన సంజన.. తనని ఫ్రీ బర్డ్ అనడం అస్సలు నచ్చలేదని ఫ్లోరా, నాగార్జునకు కంప్లైంట్ చేసింది. తను చెబుతున్నప్పుడు సంజన మధ్యలో దూరడం కరెక్ట్ కాదనేది ఫ్లోరా వాదన. కానీ సంజన మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫ్రీ బర్డ్ అనడం తప్పెలా అవుతుందని అడిగింది. కెప్టెన్ అయిన తర్వాత సంజన.. తనకు కాఫీ ఇవ్వొద్దని హౌస్‌మేట్స్‌తో చెప్పిందని ఫ్లోరా ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే కాఫీ టాపిక్కే రాలేదని సంజన చెప్పింది గానీ మిగతా టీమ్ మేట్స్ మాత్రం సంజన అలానే అనిందని క్లారిటీ ఇచ్చేశారు. బిగ్ బాస్ ఏదీ ఇవ్వకూడదని మిమ్మల్ని మందలించినప్పుడు రాముకి టీ ఇవ్వాలని మీరు ఎలా డిసైడ్ చేశారు? అని సంజనని నాగ్ అడిగాడు. ఇలా అడిగిన అన్ని ప్రశ్నలకు సంజన ఎలాంటి సంజాయిషీ ఇస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: డేంజర్ జోన్‌లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?)