
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్', 'కిష్కింధపురి' చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అందుకు తగ్గట్లే ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ కూలీ, సయారా, సు ఫ్రమ్ సో, పరదా లాంటి హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇలా వీకెండ్‌ని ఆడియెన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు మూవీ కూడా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?)
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి.. గతంలో ఓ సినిమాలో ప్రతినాయకుడిగా చేశారు. అదే 'పగ పగ పగ'. 2022 సెప్టెంబరు 22న ఇది థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ ఎవరూ లేకపోవడం, కథాకథనాలు ఓ మాదిరిగా ఉండేసరికి ఈ చిత్రంపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తర్వాత ఇన్నాళ్లకు ఆహా ఓటీటీ దీన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
'పగ పగ పగ' విషయానికొస్తే.. జగదీశ్ (కోటి), కృష్ణ (బెనర్జీ) రౌడీలు. జగదీశ్ చెప్పడంతో కృష్ణ, ఓ కుర్రాడిని హత్య చేస్తాడు. జైలుకెళ్లిన కృష్ణకి జగదీశ్ ధైర్యం చెబుతాడు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇస్తాడు. కానీ కృష్ణ కుటుంబాన్ని జగదీశ్ గాలికొదిలేస్తాడు. మరోవైపు కృష్ణ కొడుకు అభి కాలేజీలో చదువుతుంటాడు. జగదీశ్ కూతురు సిరితో ప్రేమిస్తుంటాడు. కూతురి ప్రేమ విషయం జగదీశ్‌కి తెలుస్తుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదని కూతురితో చెబుతాడు. దాంతో లేచిపోయి వెళ్లిపోయిన సిరి, అభిని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'మిరాయ్'తో పోటీ.. 'కిష్కింధపురి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)