
గత నెలలో మంచి హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన సినిమా 'కూలీ'. రజినీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్.. ఇలా చాలామంది స్టార్స్ ఉండేసరికి ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. కానీ మూవీ ఓ మాదిరిగా ఉండటం వాళ్లని నిరాశపరిచింది. అసలు లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రం తీశాడా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆమిర్ కూడా ఈ సినిమాలో నటించానని తప్పు చేశానని అన్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ నిజమేంటి?
'కూలీ'లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. క్లైమాక్స్‌లో దహా అనే రోల్ చేశాడు. అయితే ఇది కేవలం రజినీకాంత్ కోసమే చేశానని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమిర్ చెప్పాడు. తీరా మూవీలో చూస్తే అది ఏ మాత్రం ప్రభావం చూపించకపోగా, సీరియస్ సీన్‌లో ఆమిర్ కామియో మరీ కామెడీగా అనిపించింది. విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి.
(ఇదీ చదవండి: Bigg Boss 9 డేంజర్ జోన్‌లో వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?)
అసలు విషయానికొస్తే రెండు మూడు రోజుల నుంచి బాలీవుడ్ మీడియాలో ఆమిర్-లోకేశ్ కనగరాజ్ చేయాల్సిన సూపర్ హీరో సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందనేది తెలియదు గానీ ఇప్పుడు ఏకంగా ఆమిర్ మాట్లాడినట్లు ఓ పేపర్ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. 'కూలీలో నటించి పెద్ద తప్పు చేశా' అని ఆమిర్ అన్నట్లు అందులో రాసుకొచ్చారు. అయితే ఎక్కడ ఎప్పుడు ఆమిర్ ఇలా మాట్లాడారనేది వెతికితే మాత్రం అలాంటి సమాచారం కనిపించలేదు.
అయితే ఈ రూమర్స్‌ని దళపతి విజయ్ ఫ్యాన్స్ కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారని ట్విటర్‌లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లు కొన్ని స్క్రీన్ షాట్స్‌ని పోస్ట్ చేస్తున్నారు. తమిళంలో విజయ్-రజినీకాంత్ అభిమానుల మధ్య అప్పుడప్పుడు ఇలా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా విజయ్ ఫ్యాన్సే ఈ పుకారు సృష్టించారా అనే సందేహం వస్తోంది.
(ఇదీ చదవండి: ‘మిరాయ్’పై మంచు విష్ణు ట్వీట్.. రిప్లై ఇచ్చిన మనోజ్!)
