
ఎంతో అన్యోన్యంగా ఉండే మంచు ఫ్యామిలీలో కొన్నాళ్ల క్రితం పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. మనోజ్‌పై తండ్రి మోహన్ బాబు కేసు పెడితే.. తండ్రి,అన్నయ్యలపై మనోజ్ కేసులు పెట్టాడు. మీడియా ముఖంగా దాడికి దిగారు. బౌన్సర్లను పెట్టుకొని హడావుడి చేశారు. కట్ చేస్తే..ఇప్పుడు అన్నదమ్ములిద్దరు కలిసిపోయినట్లు ఉన్నారు. ఒకరి సినిమాపై మరొకరు పొగడ్తలు కురిపించుకుంటున్నారు. ఆ మధ్య రిలీజైన కన్నప్ప సినిమాపై మనోజ్ ప్రశంసలు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సినిమా బాగుందని.. విష్ణు యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక ఇప్పుడేమో తమ్ముడు నటించిన మిరాయ్ సినిమాపై విష్ణు ట్వీట్ చేశారు.
(‘మిరాయ్’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సినిమా రిలీజ్ సందర్భంగా నిన్న(సెప్టెంబర్ 12) ‘మిరాయ్’ బృందానికి విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ దేవుని దయ మీపై ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విట్ చేశాడు. అన్నయ్య ట్వీట్‌కి తమ్ముడు మనోజ్ రిప్లై ఇచ్చాడు. మిరాయ్ యూనిట్ తరపున ‘థాంక్యూ సో మచ్ అన్న’ అంటూ మనోజ్ ట్విట్ చేశాడు. వీరిద్దరి ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య ఉన్న విభేధాలు తొలగిపోయాయని.. త్వరలోనే మంచు ఫ్యామిలీ ఒకటవ్వాలని కోరుకుంటున్నామంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించిన వెంకటేశ్, మహేశ్‌బాబు కలిసిపోయే ఎమోషనల్ సీన్‌కు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..‘అన్నదమ్ములు కలిసిపోయారు’ అని రీట్వీట్స్ చేస్తున్నారు.
(చదవండి: బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు మిరాయ్ కలెక్షన్స్ ఎంతంటే?)
ఇక మిరాయ్ విషయానికొస్తే.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటించగా, మనోజ్ విలన్ మహావీర్ లామా పాత్రను పోషించాడు. రిలీజ్ తర్వాత మనోజ్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మనోజ్ విలనిజం అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. హిట్ టాక్ రావడంతో తొలి రోజే రూ. 12 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.