ప్రేమంటే ఇదేరా.. ఫస్ట్‌ చాయిస్‌ ఎవరంటే? | Unknown Facts about Venkatesh Premante Idera Movie | Sakshi
Sakshi News home page

#Premante Idera: ఫస్ట్‌ ఛాయిస్‌ ఐశ్వర్య.. రేణూ, అమీషాకు స్క్రీన్‌ టెస్ట్‌

Dec 13 2025 2:36 PM | Updated on Dec 13 2025 3:17 PM

Unknown Facts about Venkatesh Premante Idera Movie

కథ రాసుకోవడంతో సినిమా అయిపోదు, అక్కడే అసలు కథ మొదలువుతుంది. ఆ కథలోని పాత్రల ఎంపిక దగ్గరే దర్శకనిర్మాతలు మల్లగుల్లాలు పడుతుంటారు. విక్టరీ వెంకటేశ్‌ "ప్రేమంటే ఇదే రా" సినిమా విషయంలో ఇదే జరిగింది. జయంత్‌ సి. పరంజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఫస్ట్‌ ఛాయిస్‌ ఐశ్వర్య
ఇందులో వెంకీ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రీతి జింటాను తీసుకున్నారు. అయితే ప్రీతి కంటే ముందు చాలామందినే సంప్రదించారు. ఆ విషయం గురించి జయంత్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఫస్ట్‌ ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నాం. తనకు కథ బాగా నచ్చి డేట్స్‌ కూడా ఇచ్చింది. కానీ అప్పటికే తన రెండు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి.

స్క్రీన్‌ టెస్ట్‌ కూడా పూర్తి
దీంతో ఆమె ఐరన్‌ లెగ్‌ అని పక్కన పెట్టాం. అలా తనను వద్దని వేరే హీరోయిన్స్‌ దగ్గరకు వెళ్లాం. అమీషా పటేల్‌, రేణూ దేశాయ్‌ను స్క్రీన్‌ టెస్ట్‌ చేశాం. భూమిక చావ్లా, రీమా సేన్‌.. ఇలా చాలామందిని అనుకున్నాం. ఇంకో మూడునాలుగురోజుల్లో ముహూర్తం ఉందనగా రామానాయుడు స్టూడియోలో ఒంటరిగా కూర్చుని.. ఎవర్ని హీరోయిన్‌గా తీసుకోవాలి? అని తల పట్టుకున్నాను. 

ఐదు నిమిషాల్లో హీరోయిన్‌ ఫిక్స్‌
సరిగ్గా అప్పుడే అనిల్‌ కపూర్‌ వచ్చి పలకరించాడు. నా సమస్య చెప్పాను. ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన ప్రీతి జింటాను తీసుకోమని సలహా ఇచ్చాడు. తర్వాతి రోజే తనతో మీటింగ్‌ ఏర్పాటు చేశాడు. ఆమెతో మాట్లాడిన ఐదు నిమిషాల్లోనే తనే నా మూవీ హీరోయిన్‌ అని ఫిక్సయ్యాను అని చెప్పాడు. అలా ప్రేమంటే ఇదే రా మూవీతో ప్రీతి జింటా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

రీరిలీజ్‌ వాయిదా
1998లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద హిట్టయింది. రమణ గోగుల.. నైజాం బాబులు, నాలో ఉన్న ప్రేమ వంటి హిట్‌ సాంగ్స్‌ అందించారు. అన్నీ కలిసొస్తే నేడు (డిసెంబర్‌ 13న) ప్రేమంటే ఇదేరా రీరిలీజ్‌ అయ్యేది. కానీ, ప్రస్తుతానికి వాయిదా పడింది.

చదవండి: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న తారలు వీళ్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement