ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే.. | 2025 Roundup: Top Celebrities Who Got Married in 2025, Here Is the List | Sakshi
Sakshi News home page

2025 Roundup: వైవాహిక బంధంలో అడుగుపెట్టిన తారలు

Dec 13 2025 1:39 PM | Updated on Dec 13 2025 2:00 PM

2025 Roundup: Top Celebrities Who Got Married in 2025, Here Is the List

సెలబ్రిటీలు ఎంతసేపూ పనిగురించే ఆలోచిస్తుంటారు. వయసు మీద పడుతున్నా పెళ్లి ఊసెత్తరు. కొందరైతే డేటింగ్‌లోనే కాలం గడిపేస్తూ వెడ్డింగ్‌ను మాత్రం వాయిదా వేస్తుంటారు. అయితే కల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదన్నట్లు.. శుభ ఘడియలు దగ్గరపడితే పెళ్లిని ఎవరూ ఆపలేరు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సింగిల్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి జంట ప్రయాణం మొదలుపెట్టిన ఆ సెలబ్రిటీలెవరో చూసేద్దాం..

అఖిల్‌ - జైనబ్‌
కింగ్‌ నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. గతేడాది అన్న నాగచైతన్య.. శోభితను పెళ్లి చేసుకుంటే ఈ ఏడాది తమ్ముడు జైనబ్‌తో ఏడడుగులు వేశాడు. జూన్‌ 6న ఎంతో గ్రాండ్‌గా ఈ వెడ్డింగ్‌ జరిగింది.

సమంత- రాజ్‌ నిడిమోరు
హీరోయిన్‌ సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇద్దరూ జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కానీ అఫీషియల్‌గా మాత్రం ప్రకటించలేదు. డిసెంబర్‌ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్‌లో భూతశుద్ధి వివాహం చేసుకుని సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అన్నట్లు వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే!

అభిషన్‌ జీవింత్‌- అఖిల
టూరిస్ట్‌ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ అయ్యాడు అభిషన్‌ జీవింత్‌. ఓ సినిమా ఈవెంట్‌లో ప్రియురాలు అఖిలను అక్టోబర్‌ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్‌ చేశాడు. చెప్పిన డేట్‌ ప్రకారం అక్టోబర్‌ 31న ప్రియురాలు మెడలో మూడు ముళ్లు వేశాడు.

అవికా గోర్‌- మిలింద్‌ చంద్వానీ
చిన్నారి పెళ్లికూతురుతో ప్రేక్షకులను మెప్పించిన అవికా గోర్‌ నిజంగానే పెళ్లికూతురుగా ముస్తాబైంది. సెప్టెంబర్‌ 30న ఓ రియాలిటీ షోలో ప్రియుడు మిలింద్‌ చంద్వానీని పెళ్లి చేసుకుంది.

అర్మాన్‌ మాలిక్‌- ఆష్న ష్రాఫ్‌
సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ ప్రియురాలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆష్న ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. జనవరి 2న ఎంతో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది.

హీనా ఖాన్‌- రాకీ జైస్వాల్‌
బుల్లితెర నటి హీనా ఖాన్‌ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఇలాంటి కష్టసమయంలోనూ ఆమె చేయిని వదలకుండా పట్టుకున్నాడు ప్రియుడు రాకీ. ఈ ప్రేమజంట జూన్‌ 4న పెళ్లి చేసుకున్నారు.

ఆశ్లేష సావంత్‌- సందీప్‌ బస్వానా
23 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లిని పక్కనపెట్టేశారు నటులు ఆశ్లేష సావంత్‌- సందీప్‌ బస్వానా. కానీ ఇటీవల ఓ కృష్ణుడి గుడికి వెళ్లినప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక మనసులో పుట్టింది. అనుకున్నదే తడవుగా నవంబర్‌ 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

అర్చన- బీఆర్‌ శరత్‌
కన్నడ నటి అర్చన కొట్టిగె, క్రికెటర్‌ బీఆర్‌ శరత్‌ వేదమంత్రాల సాక్షిగా కొత్త జీవితాన్ని ఆరంభించారు. వీరి పెళ్లి ఏప్రిల్‌ 23న బెంగళూరులో జరిగింది.

వీళ్లే కాకుండా సారా ఖాన్‌- క్రిష్‌ పాఠక్‌.. సెలీనా గోమెజ్‌-బెన్నీ బ్లాన్కో, దర్శన్‌ రావల్‌-దరల్‌ సురేలియా, ప్రతీక్‌ బాబర్‌- ప్రియా బెనర్జీ, ఆదార్‌ జైన్‌- అలేఖ అద్వానీ, ప్రజక్త కోహ్లి- వృషాంక్‌ ఖనల్‌ వంటి పలువురు జంటలు సైతం ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement