తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు). ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ - సాయిబాబా ఆశీస్సులు ఇస్తున్న ఫొటో ఒకటి మా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఉంది. ఆ ఫొటో చూసిన ఇన్సిపిరేషన్ తో "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా స్క్రిప్ట్ మొదలైంది. ఈ సినిమా పోస్టర్ మీద ఒక సాయిబాబా ఉంటే మరో సాయిబాబాలా నాకు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు దశరథ్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తమ సహకారం అందించారు. నేను గతంలో మిస్టరీ అనే మూవీ చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రమోషన్స్ చేశాను. ఆ టైమ్ లోనే దశరథ్‌తో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చింది. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) చిత్రాన్ని హీరోగా నటిస్తూ రూపొందిస్తున్నా. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ కూడా మూవీలో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే మిగతా పార్ట్ పూర్తి చేసి మూవీని విడుదలకు తీసుకొస్తాం’ అన్నారు.
హీరోయిన్ ఏకాదంతాయ సిరి మాట్లాడుతూ - చిన్న సినిమాలోకి హీరోయిన్స్ ను తీసుకున్నారంటే ఏదో గ్లామర్ షో చేయిస్తారు అనుకుంటారు. కానీ సాయికృష్ణ దర్శకుడిగా ఒక సిన్సియారిటీ చూపించారు. సినిమాను ఎంత ఫాస్ట్ గా రూపొందించారంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఇంత స్పీడ్ గా సినిమా చేయొచ్చా అనుకున్నాం. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాం అన్నారు.
నిర్మాత తల్లాడ వెంకన్న మాట్లాడుతూ - నన్ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సాయికృష్ణ. నేను హీరోగా ఒక్కడే అనే మూవీని చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ రిలీజ్ చేశాను. ఇప్పుడు "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమాను మంచి కమర్షియల్ అంశాలతో నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో నేనొక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాను. తల్లాడ సాయితో ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమా కూడా నిర్మించబోతున్నా అన్నారు.


