Dasharath
-
తండ్రి ఆజ్ఞలో దాగిన నాయకత్వ రహస్యం
శ్రీరాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్యలో ఆనందోత్సాహాలు ఉప్పొంగుతున్న శుభవేళ. ప్రజల హృదయాల్లో ఒకే పేరు – రాముడు. న్యాయం, వినయం, ధర్మనిష్ఠల ప్రతిరూపంగా ఉన్న శ్రీరాముడు కాసేపట్లో రాజ్యభారాన్ని స్వీకరించబోయే సమయంలో, ఎవ్వరూ ఊహించనిదిగా ఆ దృశ్యం కాస్తా మారిపోయింది. ఆనందోత్సాహాల స్థానంలో నిరాశా నిస్పృహలు... రాజసభలో నిశ్శబ్ద వాతావరణం. కారణం – దశరథుడు, భార్య కైకేయికి ఇచ్చిన మాటతో అంతా తారుమారు కావడం.రాజ్యాన్ని వదిలి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమనే ఆజ్ఞను రామునికి తెలియజేయటానికి కూడా ఆయనకి ధైర్యం ఉండదు. ఈ పరిస్థితిలో, కైకేయి రామునికి ఈ విషయం చెప్పినప్పుడు రాముడు స్పందించిన తీరుని వాల్మీకి మహర్షి ‘న హమర్థ పరో దేవి’... అమ్మా! సంపదల కోసం నేను జీవించను. ‘మాం ఋషిభిస్తుల్యం, కేవలం ధర్మమాస్థితం’... ఋషుల వలె ధర్మాన్ని ఆచరించడం మాత్రమే నా తత్త్వం అని నీకు తెలిసిందే కదమ్మా...’’ అంటాడు. ఇది అంధ విధేయత కాదు. ఆయన చైతన్య పూర్వక నిర్ణయం. రాముడు తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తన హక్కును వినియోగించుకోవచ్చు కానీ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టటమే రాజధర్మమని గ్రహించాడు.అయితే ఆయన ఆజ్ఞను పాటించటం కేవలం కుమార ధర్మం మాత్రమేనా? లేక దానిలో మరింత లోతైన ధర్మబోధ, నాయకత్వ దృష్టి, విలువల పట్ల నిబద్ధత దాగి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం వాల్మీకి రామాయణం వైపు తిరగాలి. ’పితుర్వచన నిర్దేశాత్, పితుర్వచన గౌరవాత్’.... తండ్రి మాట గౌరవం కోసం, ఆయన ఆజ్ఞను పాటించాలనుకుంటున్నాను అంటాడు. శ్రీరాముడు దశరథుడు ఇచ్చిన వాగ్దానం విఫలమైతే, రాజ్యంపై, రాజుపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. అందుకే రాముడు తండ్రికి చెప్పి, ఓదార్పును ఇచ్చాడు.కౌసల్యాదేవి రాముని వనవాస వార్త విని దుఃఖించినప్పుడు ఆమెను కూడా ధైర్యపరుస్తూ, ఓదార్చిన తీరు అమోఘం. తండ్రిగారు మనకి రాజు; మనల్ని పోషించే దశరథుడు మనకి గురుస్థానంలో ఉన్నారు – మనకంటే పెద్దవారు. అందరితో పాటు మనిద్దరమూ కూడా ఆయన ఆజ్ఞని పాటించి తీరాలి. స్త్రీకి స్వర్గ్రపాప్తికి భర్త శుశ్రూష ఒక్కటే మార్గమమ్మా అని వివరించాడు. ‘దశరథస్తు ధర్మాత్మా’ అంటారు మహర్షి. అంటే పితృవాక్యం ధర్మవాక్యం అని ఒక సందేశాన్నిస్తున్నారు. ఈ సందేశం ఎప్పటికీ సత్యమే. ఇదంతా విని కౌసల్య రాముని ధర్మనిష్ఠకి పోంగిపోయింది.శ్రీరాముడు వనవాసం చేయాలన్న వార్త తెలియగానే, లక్ష్మణుడు కోపంతో ఊగిపోతూ ముసలివాడైన తండ్రిని అంతం చేస్తానన్నాడు. అతణ్ణి వారిస్తూ, తండ్రిగారి ఆజ్ఞని తప్పకుండా ఆచరించాల్సిందేనని తమ్ముడికి కర్తవ్య బోధ చేస్తాడు. ఈ విధంగా ఏకకాలంలో కుటుంబానికి బలం ఇచ్చినవాడు శ్రీరాముడు – తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టటానికి, రాజ్య ప్రతిష్టను కాపాడటానికి, తన హక్కుని త్యాగం చేశాడు.అరణ్యవాసం – నాయకత్వ శిక్షణఇంకొక కోణంలో చూస్తే అరణ్యవాసం రాముని నాయకత్వానికి ఒక శిక్షణా శిబిరం అయింది. రాజ్రపాసాదంలో అన్ని హంగులతో పెరిగిన శ్రీరాముడు, అరణ్యంలో ఋషుల కష్టాల్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నాడు. ప్రజల బాధలను ప్రత్యక్షంగా అనుభవించాడు. అటు రాక్షసులతోనూ, ఇటు ఋషులతోనూ, సాధారణ జీవితాన్ని గడుపుతూ, ఉపశమనం, సహనం, విధేయత, ధర్మనిష్ఠని పాటిస్తూ, సమగ్ర నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. గిరిజనుల జీవన విధానాన్ని తెలుసుకున్నాడు. పాలనలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం వారితో సహజీవనం ఎంత అవసరమో రాముడి జీవితం చెబుతోంది. అధికారంలోకి రాకముందే అనుభవం సంపాదించిన నాయకుడిగా ఎదగగలిగాడు. కనుక అరణ్యవాసం రాజ్యభారానికి శిక్షణ శిబిరంగా చెప్పొచ్చు.విలువలపై నిలిచిన వ్యక్తిత్వంరాముని వనవాస నిర్ణయం తక్షణ ఫలితాల కోసం కాదు, దీర్ఘకాలిక విలువల కోసం. తన వ్యక్తిగత ఆనందం, తల్లిదండ్రుల ప్రేమ, రాజ్యాభిషేక గౌరవం మొదలైనవన్నీ పక్కన పెట్టి, ధర్మాన్ని ఎంచుకుని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనిపించుకున్నాడు.ప్రస్తుత సంక్షుభిత సమయంలో రాముడి జీవితం ఒక స్ఫూర్తి. మాట నిలబెట్టుకోవడం, బాధ్యతని నిస్వార్థంగా స్వీకరించటం, క్లిష్టకాలంలో ధైర్యంగా నిలబడటం, హక్కుల కంటే కర్తవ్యాన్ని ముందుంచటం, తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడటం మొదలైనవి ఏ కాలానికైనా వర్తిస్తాయి.శ్రీరాముని జీవితం మనకిచ్చే సందేశం ఒక్కటే –‘అధికారం గొప్పది కాదు; ఆ అధికారాన్ని నిలబెట్టే విలువలే గొప్పవి’. శ్రీరాముని విధేయతను చాలామంది త్యాగంగా చూస్తారు కానీ, అది స్వచ్ఛంద ధర్మం. అందుకే రామకథ యుగ యుగాలపాటు మన హృదయాల్లో వెలుగుతుంది. అది భక్తి కథ మాత్రమే కాదు, ఆత్మవిమర్శకు ఆహ్వానం కూడా! నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు రాముడికి తులసి మాలను ధరింపజేయాలి. పూర్తయిన తర్వాత అన్నదానం చేసి, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ఆహూతులకు బహుమతిగా ఇవ్వడం ద్వారా శుభఫలితాలు చేకూరతాయి.రామననమిరోజు రామాలయాన్ని దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణం వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయని ప్రతీతి.శ్రీ రామనవమి రోజున పానకం–వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ్రపాకృతిక పరమార్థం ఏమిటంటే ఇది వేసవికాలం కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి చెందుతాయని పండితుల అభిప్రాయం. – దావులూరి రామకృష్ణ శర్మ విశ్రాంత అధ్యాపకులు -
సస్పెన్స్ థ్రిల్లర్ గా మ్యాజిక్ మూవ్ మెంట్స్
తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు). ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ - సాయిబాబా ఆశీస్సులు ఇస్తున్న ఫొటో ఒకటి మా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఉంది. ఆ ఫొటో చూసిన ఇన్సిపిరేషన్ తో "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా స్క్రిప్ట్ మొదలైంది. ఈ సినిమా పోస్టర్ మీద ఒక సాయిబాబా ఉంటే మరో సాయిబాబాలా నాకు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు దశరథ్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తమ సహకారం అందించారు. నేను గతంలో మిస్టరీ అనే మూవీ చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రమోషన్స్ చేశాను. ఆ టైమ్ లోనే దశరథ్‌తో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చింది. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) చిత్రాన్ని హీరోగా నటిస్తూ రూపొందిస్తున్నా. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ కూడా మూవీలో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే మిగతా పార్ట్ పూర్తి చేసి మూవీని విడుదలకు తీసుకొస్తాం’ అన్నారు. హీరోయిన్ ఏకాదంతాయ సిరి మాట్లాడుతూ - చిన్న సినిమాలోకి హీరోయిన్స్ ను తీసుకున్నారంటే ఏదో గ్లామర్ షో చేయిస్తారు అనుకుంటారు. కానీ సాయికృష్ణ దర్శకుడిగా ఒక సిన్సియారిటీ చూపించారు. సినిమాను ఎంత ఫాస్ట్ గా రూపొందించారంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఇంత స్పీడ్ గా సినిమా చేయొచ్చా అనుకున్నాం. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాం అన్నారు.నిర్మాత తల్లాడ వెంకన్న మాట్లాడుతూ - నన్ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సాయికృష్ణ. నేను హీరోగా ఒక్కడే అనే మూవీని చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ రిలీజ్ చేశాను. ఇప్పుడు "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమాను మంచి కమర్షియల్ అంశాలతో నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో నేనొక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాను. తల్లాడ సాయితో ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమా కూడా నిర్మించబోతున్నా అన్నారు. -
Inspiration దశరథుడి మంత్రి మండలి
రాచరికాలు నడిచిన ప్రాచీన కాలంలో కూడా సమర్థులైన పాలకులెవరూ నిరంకుశులుగా, నియంతలుగా, కేవలం తమ ఇచ్చ వచ్చినట్టు పరిపాలించటం ఉండేది కాదు. మన పురాణేతిహాసాలలో ప్రసిద్ధులైన రాజులందరూ, రాజ్య పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలను, మేధావులయిన తమ మంత్రుల బృందాలతోనూ, ఇతర నిపుణులతోనూ, అవసరమయితే పౌర ప్రముఖులతోనూ, సామంతులతోనూ, జానపదులతోనూ విస్తృతంగా చర్చించిన తరవాతే తీసుకొనేవాళ్ళని కనిపిస్తుంది. అల్పబుద్ధులూ, ఆసురీ స్వభావులు మాత్రమే అధికార మదాంధకారంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా, నిరంకుశంగా, ఇష్టారాజ్యంగా పాలించి, అందరినీ అవస్థలు పెట్టి, అపయశస్సు కూడగట్టుకొని, ఆయువు తీరగానే కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు.దశరథుడు అరవయి వేల సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన చేశాడని రామాయణం చెబుతుంది. ఏ కీలక నిర్ణయమైనా, ఆయన సంబంధితులందరితో విస్తృతంగా చర్చించిగానీ తీసుకొనేవాడు కాదు అని వాల్మీకి వక్కాణించాడు. దశరథుడికి ఒక సమర్థమైన మంత్రిమండలి ఉండేది. వాళ్ళలో ప్రధానమైన మంత్రులు ఎనిమిది మంది: ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళుగాక, దశరథుడికి వసిష్ఠుడు, వామదేవుడు ముఖ్య పురోహితులుగా, ధర్మ నిర్దేశకులుగా, గురువులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ నేపథ్యం గురించి ఎంతో పరిశోధన జరిపించిన తరవాతే, దశ రథుడు తన మంత్రులను నియమించుకొనేవాడు. వాళ్ళు ఎన్నో పరీక్షలు నెగ్గవలసి ఉండేది. అందుకే ఆ మంత్రులందరూ పరువు ప్రతిష్ఠలు కలవారుగా, సంస్కా రులుగా, శాస్త్ర జ్ఞాన నిష్ణాతులుగా ఉండేవారు. వాళ్ళు కుశాగ్ర బుద్ధులు, విద్యావంతులు, లోకజ్ఞులు, నీతి వేత్తలు. ఎప్పుడూ రాజు శ్రేయస్సునూ, రాజ్య శ్రేయస్సునూ కాంక్షించే నిస్వార్థపరులు, నిజాయతీపరులు. అపరాధులయితే, సొంత పుత్రుల నయినా నియమానుసారం దండించే నిష్పక్షపాతులు. ఇంతటి నిపుణులతో, నీతిమంతులతో, ధర్మజ్ఞులతో అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించిన తరవాతే అన్ని ముఖ్యమైన నిర్ణయాలూ తీసుకోవటం జరిగేది. కనకనే దశరథుడి సుదీర్ఘ పాలనలో ప్రజలంతా ధర్మమార్గంలో తృప్తిగా, సుఖశాంతులతో జీవించారు అని వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది.– ఎం. మారుతి శాస్త్రి -
'హట్సన్ కంపెనీ' లో విషాదం..! యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆందోళన..!!
సంగారెడ్డి: జహీరాబాద్ మండలం గోవింద్పూర్ వద్ద గల హట్సన్ కంపెనీలోని వాటర్ ట్యాంక్‌లో పడి గిరిజన యువ కుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. మొగుడంపల్లి మండలం మిర్జపల్లి తండాకు చెందిన హేమ్సింగ్కు ముగ్గురు కొడుకులు. చిన్నవాడైన దశరథ్(23) హట్సన్ కంపెనీలో వాటర్‌మెన్‌గా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 5.30 గంటలకు డ్యూటీకి వెళ్లాడు. సుమారు 7 గంటల ప్రాంతంలో కంపెనీలో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయడానికి వెళ్లి కాలు జారి నీళ్లలో పడ్డాడు. ఈత రాకపోవడంతో అందులో మునిగి మృతి చెందాడు. దశరథ్ ఎంతకీ రాకపోవడంతో తోటి కార్మికులు వెళ్లి చూడగా ట్యాంక్‌లో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కంపెనీ వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా కంపెనీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గేటు వద్ద ఆందోళనకు దిగారు. చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్, జహీరాబాద్ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ నుంచి శవాన్ని బయటకు తీయించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మృతి చెందాడని, న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో వచ్చిన తరువాత మాట్లాడి తగిన న్యాయం చేస్తామని డీఎస్పీ రఘు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. జహీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘లవ్ యు రామ్’ మూవీ రివ్యూ
టైటిల్: లవ్ యు రామ్ నటీనటులు: రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్, బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్,మల్లిక్,దశరథ్ తదితరులు నిర్మాణ సంస్థ: మన ఎంటర్టైన్మెంట్, శ్రీ చక్ర ఫిల్మ్స్ నిర్మాతలు: డీవై చౌదరి,దశరథ్ కథ: దశరథ్ దర్శకత్వం: డీవై చౌదరి సంగీతం: వేద సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్ విడుదల తేది: జూన్ 30, 2023 కథేంటేంటే.. రామ్ (రోహిత్ బెహల్), నార్వేలో శ్రీనివాస హోటల్స్ అనే బిజినెస్ చైన్ నడుపుతూ ఉంటాడు. జీవితంలో అనేక ఎదురుదెబ్బలు తిని కమర్షియల్ గా మారిపోయిన రామ్ టాక్స్ ఎగ్గొట్టడం కోసం తన దగ్గర ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేసేందుకు ఒక వైఫ్ కం ఎంప్లాయ్ కోసం పెళ్లి చూపుల వేట మొదలు పెడతాడు. పార్టనర్ ను చేసుకుంటాను అని చెబుతూ తన బిజినెస్ చైన్ కి సిఈఓగా ఉన్న పీసీ(దశరథ్)ని తనకు తగిన అమ్మాయిని వెతకమని చెబుతాడు. ఈ క్రమంలో ఐదుగురిని సెలెక్ట్ చేసుకోగా వారిలో అతని చిన్ననాటి స్నేహితురాలు దివ్య (అపర్ణ జనార్దనన్) ఎదురవుతుంది. అయితే ఆమె తన చిన్నప్పటి ఫ్రెండ్ అని తెలియక రామ్ ఆమెను బిజినెస్ పరంగా వాడుకోవాలని అనుకుంటాడు. చిన్నప్పుడు రామ్ మాటల వల్లే నలుగురికి సహాయం చేసే గుణం అలవర్చుకున్న దివ్యకి పెళ్లి గంట ఉందనగా రామ్ నిజ స్వరూపం బయట పడుతుంది. మరి రామ్ ను దివ్య పెళ్లి చేసుకుందా? దివ్య తన చిన్ననాటి స్నేహితురాలు అని తెలిసిన రామ్ ఎలా స్పందించాడు? చివరికి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారా ? లేదా? అనేదే సినిమా కథ. ఎలా ఉందంటే... ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరిని ఇష్టపడుతుంది. అతనే ఆ అమ్మాయికి స్ఫూర్తిని ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కాలగమనంలో వేరే క్యారెక్టర్ అయిపోయాడని తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ? అనేదే ‘లవ్ యు రామ్’ కథ. ఇది ఈ జనరేషన్ లవ్ స్టొరీ. ఇప్పుడు దాదాపు ఎక్కువ ప్రేమలు సోషల్ మీడియాలోనే మొదలవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా మొబైల్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం..ఆ తర్వాత స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమలో పడడం జరుగుతుంది. అంతవరకు ఇద్దరి మధ్య విపరీతమైన ప్రేమ ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత ఒక్కొక్క నెగిటివ్ లేయర్ బయటపడుతుంది. చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఇలాంటి సమయంలో ఆ ప్రేమకథ పరిస్థితి ఏమిటి ? అనేది ఈ సినిమా ద్వారా చూపించారు. చాలా మంది జీవితాల్లో జరిగే కథ ఇది. ట్రెండింగ్ పాయింట్‌ని కథగా మలిచాడు దర్శకుడు దశరథ్. అయితే దానిని తెరపై చూపించడంలో దర్శకుడు చౌదరి కాస్త తడబడ్డాడు. సినిమా ప్రారంభంలోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించారు. రేటింగ్ ఇస్తూ పెళ్లి కోసం ఆన్లైన్ వేదికగా అమ్మాయిని వెతకడం..ఒక అమ్మాయిని ఫిక్స్ అయి ఇండియా కొస్తే.. ఆమె లేచిపోవడం.. చివరకు హీరోయిన్ ఇంటికి వెళ్లడం..ఆమెతో ప్రేమలో ఉన్నట్లు నటించడం...మధ్య ఇరు కుటుంబాల మధ్య జరిగే సరదా సన్నివేశాలతో చూస్తుండగానే ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. కానీ సెకండాఫ్ తర్వాత కథ రొటీన్‌గా సాగుతుంది. హీరోయిన్ని ఇంప్రెస్ చేయడం కోసం హీరో ప్రయత్నించడం.. వెంటనే అతని నిజస్వరూపం హీరోయిన్‌కి తెలియడం... ఆమె బాధపడడం..మళ్లీ ఒక చాన్స్ ఇవ్వడం..ఇలా రోటీన్‌గా, ఊహకందేలా కథనం సాగుతుంది. క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. కానీ పీసీ పాత్రలో దశరథ్ చేసే కామెడీ, డబ్బు కోసం అబ్బాయి ఫ్యామిలీ వాళ్లను అమ్మాయి తండ్రి( బెనర్జీ) బురిటీ కొట్టించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచాలు లేకుండా వెళ్తే ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ కొంతమేర అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. పెళ్లిని కూడా కమర్షియల్‌గా చూసే రామ్ పాత్రకు రోహిత్ బెహల్ న్యాయం చేశాడు. పల్లెటూరికి చెందిన యువతి దివ్యగా అపర్ణ జనార్ధనన్, చక్కగా నటించింది. ఇక దర్శకుడు దశరథ్ తొలిసారి ఆన్ స్క్రీన్‌పై కనిపించాడు. పీసీ పాత్రలో నటించిన ఆయన.. కామెడీ బాగా పండించాడు. ఆయన వేసే పంచ్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. జూదానికి అలవాటు పడి ఇంట్లోనే ఖాలీగా ఉంటున్న భర్తగా బెనర్జీ తన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రదీప్, కాదంబరి కిరణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. వేద నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
దర్శకత్వం కంటే నటన చాలా ఈజీ
‘‘లవ్ యు రామ్’ చిత్రంలో తొలిసారి తప్పని పరిస్థితిలో నేను నటించాల్సి వచ్చింది. నటించే ముందు మొదట ట్రయిల్ షూట్ చేశాం.. అందరికీ నచ్చింది. ఇప్పటివరకూ ప్రీమియర్స్ చూసిన అందరూ బాగా చేశానని అభినందించారు. ఇకపై నటన కొనసాగించాలనుకోవడం లేదు. నటుడిగా సక్సెస్ అయితే మాత్రం దర్శకత్వం కంటే నటనే చాలా ఈజీ (నవ్వుతూ)’’ అని కె. దశరథ్ అన్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ లీడ్ రోల్స్‌లో డీవై చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ యు రామ్’. డైరెక్టర్ కె. దశరథ్ కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె. దశరథ్ మాట్లాడుతూ– ‘‘డీవై చౌదరి, నేను మూడు వెబ్ సిరీస్‌లు చేశాం. ఆ తర్వాత ఒక చిన్న లవ్ స్టోరీ చేద్దామని ‘లవ్ యు రామ్’ కథ రాశాను. చాలామంది జీవితాల్లో జరిగే కథ ఇది. పెళ్లి నుంచి శోభనం మధ్యలో జరిగే ప్రేమకథ. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందిన మా సినిమా అందర్నీ అలరిస్తుంది. రోహిత్, అపర్ణ అంకితభావంతో పని చేశారు. వేద చాలా మంచి సంగీతం ఇచ్చాడు. ఇండస్ట్రీలో ముందు యండమూరి, పరుచూరి బ్రదర్స్, తేజ గార్ల వద్ద రైటర్‌గా పని చేశాను. కానీ నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో వారి స్టయిల్ ఉండదు. నేను నాలా తీయడానికి ఇష్టపడతాను. కానీ, నేను రచయితగా పని చేసినప్పుడు మాత్రం కస్టమర్ ఈజ్ ది కింగ్. వాళ్లకి ఏం కావాలో అది ఇవ్వాలి. అలా ‘ఉస్తాద్’కి మాస్ కమర్షియల్ కథ అందించాను. ప్రస్తుతం ఒక కొత్త ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అలాగే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. దానికి డైరెక్టర్ హరీష్ శంకర్ షో రన్నర్‌గా ఉంటారు’’ అన్నారు. -
సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్
సాధారణంగా నింబంధనలు పాటించని వాహనాదారులను ఆపి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. ఫైన్ వేసినప్పుడు వావాహనదారుడి వివరాలను తీసుకొని రశీదు ఇస్తారు. అయితే ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయిన ఓ వాహనదారుడు చెప్పిన వివారాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని కొల్లాం జిల్లా చాడమంగళంలో ఓ వ్యక్తిని సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసుల ఆపి రూ.500 ఫైన్ వేస్తాడు. అయితే అప్పటికే తాను ఫైన్ కట్టినట్లు ఆ వాహనదారుడు చెబుతాడు. అయితే తప్పనిసరిగా మళ్లీ జరిమానా కట్టాలని పోలీసులు అనడంతో.. చేసేదేంలేక ఆ వాహనదారుడు తన అసలు పేరు కాకుండా.. తన పేరు రామా(రామన్)అని, తండ్రి పేరు దశరథ, ఊరు అయోధ్య అని చెబుతాడు. ప్రభుత్వానికి ఫైన్ల రూపంలో డబ్బు వస్తున్నప్పుడు ప్రయాణికుడు ఏం చెప్పినా తనకు అవసరం లేదన్నట్టు పోలీసు రశీదు రాసి ఇస్తాడు. దీనికి సంబంధించిన రశీదును వాహనదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇటీవల కాలంలో కేరళలో ట్రాఫిక్ పోలీసులు కారణం లేకుండా జరిమానాలు విధిస్తూ.. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్, కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పోలీసులు విచ్చలవిడిగా ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
దశరథ్‌తో మళ్లీ..!
మనోజ్-దశరథ్ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీ’ చిత్రం క్లీన్ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకుంది. తమన్నా ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయమయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత మనోజ్-దశరథ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవలే ‘సూర్య వర్సెస్ సూర్య’తో విజయాన్నందుకున్న నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ సినిమా నిర్మించనున్నారు. దశరథ్ శైలిలో సాగుతూనే, మనోజ్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, జూన్‌లో చిత్రీకరణ మొదలుపెడతామనీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తామనీ నిర్మాత తెలిపారు.


