దశరథ్‌తో మళ్లీ..! | Sakshi
Sakshi News home page

దశరథ్‌తో మళ్లీ..!

Published Sun, May 10 2015 12:28 AM

దశరథ్‌తో మళ్లీ..!

మనోజ్-దశరథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీ’ చిత్రం క్లీన్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంది. తమన్నా ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయమయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత మనోజ్-దశరథ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవలే ‘సూర్య వర్సెస్ సూర్య’తో విజయాన్నందుకున్న నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ సినిమా నిర్మించనున్నారు. దశరథ్ శైలిలో సాగుతూనే, మనోజ్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, జూన్‌లో చిత్రీకరణ మొదలుపెడతామనీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తామనీ నిర్మాత తెలిపారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement