టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు భోగి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. తమ పిల్లలతో ఈ పండుగను ఆనందగా జరుపుకున్నారు. ఇంటిముందు భోగి మంటలు వేసి భోగి వైబ్స్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా.. మంచు మనోజ్ గతేడాది మిరాయ్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా గతేడాది రిలీజైన భైరవం మూవీలోనూ మంచు మనోజ్ కనిపించారు.


