దుబాయ్‌లో మంచు విష్ణు.. యుద్ధంపై మనోజ్ ట్వీట్ | Manchu Manoj Tweet On Iran And USA War, Prays For Civilians Amid Iran-US-Israel Tensions, Dubai Hit By Missile Strikes | Sakshi
Sakshi News home page

Manchu Manoj: దుబాయ్‌లో మంచు విష్ణు.. యుద్ధంపై మనోజ్ ట్వీట్

Mar 1 2026 11:03 AM | Updated on Mar 1 2026 11:57 AM

Manchu Manoj Tweet On Iran and usa war about dubai

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. యుద్ధం అనేది మానవత్వాన్ని ఎప్పటికీ చూపదని అన్నారు. ఈ దాడుల్లో ఎంతోమంది అమాయకుల జీవితాలు నాశమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఎవరూ కూడా సరిదిద్దలేరని పోస్ట్ చేశారు. ఇలాంటి హింసాత్మక పరిస్థితుల్లో దుబాయ్‌లో చిక్కుకుపోయిన అమాయక ప్రజలం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంచు మనోజ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రపంచమంతా శాంతించాలని కోరుకుంటున్నట్లు ఫోటోను షేర్ చేశారు.

కాగా.. ఇరాన్‌పై దాడి తర్వాత దుబాయ్‌ మిస్సైల్స్ వర్షం కురుస్తోంది. ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్‌ మిస్సైల్స్‌తో దుబాయ్‌పై దాడులు మొదలెట్టింది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో పలువురు ప్రముఖులు చిక్కుకుపోయారు. మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు సైతం దుబాయ్‌లో ఉన్నానని మిస్సైల్స్‌ పడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు సైతం దుబాయ్‌లో ఉన్నారు. ఆల్ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ ఆడేందుకు వెళ్లి ఆక్కడే చిక్కుకున్నారు.  
 

 

Advertisement
 
Advertisement
Advertisement