పాత ఫోన్‌కు కొత్త కవర్‌..మంచి మాట చెప్పిన మంచు మనోజ్‌ | Manchu Manoj Latest Speech Goes Viral | Sakshi
Sakshi News home page

పాత ఫోన్‌కు కొత్త కవర్‌..మంచి మాట చెప్పిన మంచు మనోజ్‌

Feb 28 2026 5:48 PM | Updated on Feb 28 2026 6:00 PM

Manchu Manoj Latest Speech Goes Viral

మంచు మనోజ్‌ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా హుషారుగా ఉంటాడు. చాలా ఓపెన్‌గా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతాడు. తన చేష్టలు, మాటలతో చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తుంటాడు. కానీ తాజాగా అయన అందరికీ ఓ మంచి సందేశం ఇచ్చాడు. మెప్పు కోసం అప్పులు చేయొద్దదంటూ యువతకు విలువైన సలహా ఇచ్చాడు. తాజాగా ఆయన ఓ యూనవివర్సీటీలో జరిగిన ఈవెంట్‌కు అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గౌరవం అనేది మనం చేసే పనుల వల్ల వస్తుందని.. వాడే వస్తువుల వల్ల రాదని చెప్పారు.  

పాతఫోన్‌కు కొత్త కవర్‌
ఈ సందర్భంగా మంచు మనోజ్‌ ఓ ఆసక్తికర విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నాడు.  అదేంటంటే.. మనోజ్‌ ఇప్పటికీ పాత ఐఫోన్‌నే వాడుతున్నాడు.కానీ దానికి  iPhone 17 Pro Max కవర్ వేసి మ్యానేజ్‌ చేస్తున్నాడు.  ఆ ఫోన్‌ను చూపిస్తూ.. ఇతరుల మెప్పు కోసం అప్పులు చేసి విలాసాలకు వెళ్లవద్దని యువతకు సూచించారు. డబ్బు వృథా చేయకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

మనోజ్‌ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం ‘డేవిడ్‌ రెడ్డి’అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో మనోజ్‌ బ్రిటిష్‌ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరా డిన యోధుడు డేవిడ్‌ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాన్‌ ఇండియా పీరియాడిక్‌ మూవీని నల్లగంగుల వెంకట్‌ రెడ్డి, భరత్‌ మోటుకూరి నిర్మిస్తున్నారు.హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. మారియా ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement