ఈ ఏడాది సంక్రాంతికి 'అనగనగ ఒక రాజు' సినిమాతో సక్సెస్ అందుకున్న సితార నిర్మాణ సంస్థ నుంచి ఈ ఏడాదిలో పలు చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటి 'వింటారా సరదాగా'. మహేశ్ మేనల్లుడు అశోక్ హీరో కాగా శ్రీ గౌరీప్రియ హీరోయిన్. పూర్తిగా అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'అనగాఅనగా అమెరికా' అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది వినసొంపుగా ఆకట్టుకుంటోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)
ఉద్భవ్ అనే నటుడు.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అమెరికాలో ఉంటున్న తెలుగు యువతీయువకుడు ప్రేమలో పడటం, తర్వాత జరిగే పరిస్థితులు నేపథ్యంగా మూవీ తీసినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)


