breaking news
thallada sai krishna
-
సస్పెన్స్ థ్రిల్లర్ గా మ్యాజిక్ మూవ్ మెంట్స్
తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు). ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ - సాయిబాబా ఆశీస్సులు ఇస్తున్న ఫొటో ఒకటి మా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఉంది. ఆ ఫొటో చూసిన ఇన్సిపిరేషన్ తో "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా స్క్రిప్ట్ మొదలైంది. ఈ సినిమా పోస్టర్ మీద ఒక సాయిబాబా ఉంటే మరో సాయిబాబాలా నాకు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు దశరథ్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తమ సహకారం అందించారు. నేను గతంలో మిస్టరీ అనే మూవీ చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రమోషన్స్ చేశాను. ఆ టైమ్ లోనే దశరథ్‌తో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చింది. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) చిత్రాన్ని హీరోగా నటిస్తూ రూపొందిస్తున్నా. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ కూడా మూవీలో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే మిగతా పార్ట్ పూర్తి చేసి మూవీని విడుదలకు తీసుకొస్తాం’ అన్నారు. హీరోయిన్ ఏకాదంతాయ సిరి మాట్లాడుతూ - చిన్న సినిమాలోకి హీరోయిన్స్ ను తీసుకున్నారంటే ఏదో గ్లామర్ షో చేయిస్తారు అనుకుంటారు. కానీ సాయికృష్ణ దర్శకుడిగా ఒక సిన్సియారిటీ చూపించారు. సినిమాను ఎంత ఫాస్ట్ గా రూపొందించారంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఇంత స్పీడ్ గా సినిమా చేయొచ్చా అనుకున్నాం. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాం అన్నారు.నిర్మాత తల్లాడ వెంకన్న మాట్లాడుతూ - నన్ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సాయికృష్ణ. నేను హీరోగా ఒక్కడే అనే మూవీని చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ రిలీజ్ చేశాను. ఇప్పుడు "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమాను మంచి కమర్షియల్ అంశాలతో నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో నేనొక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాను. తల్లాడ సాయితో ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమా కూడా నిర్మించబోతున్నా అన్నారు. -
వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీలు
కుండపోత వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు సైతం మేమున్నామంటూ తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తమవంతు సాయం చేశారు.అలీ దంపతుల గొప్ప మనసుతాజాగా కమెడియన్ అలీ దంపతులు ఆంధ్రప్రదేశ్‌కు రూ.3 లక్షలు, తెలంగాణకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ సైతం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాకు కలిపి రూ.1.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. అతడి స్నేహితులతో కలిసి.. వరదల వల్ల ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఆహారం, నిత్యావసర వస్తులను పంచుతూ మానవత్వం చాటుకున్నారు.అక్కినేని కుటుంబం సాయంమరోవైపు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటే అక్కినేని కుటుంబం తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చింది. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ సాయాన్ని అందజేశాయి. మరోవైపు రామ్‌చరణ్ సైతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు.. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి…— Ram Charan (@AlwaysRamCharan) September 4, 2024మెగా హీరో సాయిధరమ్ తేజ్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ.10 లక్షలు విరాళమిచ్చాడు. అలాగే అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ. 5 లక్షలు సాయం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు.…— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 4, 2024చదవండి: కోట్లు దానం చేసిన ప్రభాస్-బన్నీ -
Mystery Movie: ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా ఆలీ
తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్. అలీ, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆలీ పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రం ఫోరెన్సిక్ ఆఫీసర్ సాయి పాత్రలో ఆలీ కనిపిస్తాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ ‘దర్శకుడు సాయికృష్ణ గారు నాకు కథ చేపినపుడు చాలా కొత్తగా అనిపించింది, వెంటనే సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది’ అని తెలిపారు. ‘మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రం. ఆలీ డిఫరెంట్‌గా ఉంటుంది. కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’అని హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ అన్నారు.


