ఈ వారం ఓటీటీల్లో పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ 'కాంత', అల్లరి నరేశ్ '12ఏ రైల్వే కాలనీ'తో పాటు డబ్బింగ్ చిత్రాలైన బ్రాట్, ఆరోమలేతో పాటు తెలుగు వెబ్ సిరీస్ త్రీ రోజెస్ రెండో సీజన్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు హారర్ మూవీ కూడా సడన్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో చూడొచ్చు.
(ఇదీ చదవండి: ‘మోగ్లీ’మూవీ రివ్యూ)
శ్రీజిత్, నిష్కల, రమ్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'చెరసాల'. ఈ ఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. కాకపోతే చిన్న సినిమా కావడం, యాక్టర్స్ ఎవరూ పేరున్న వాళ్లు కాకపోవడంతో ఇది వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులో ఉంది.
'చెరసాల' విషయానికొస్తే.. వంశీ (శ్రీజిత్), ప్రియ (నిష్కల) కాలేజీ స్టూడెంట్స్. కలిసి చదువుకున్నప్పుడే ప్రేమలో పడతారు కానీ బయటకు చెప్పుకోరు. కాలేజీ చదువులు పూర్తయ్యాక స్నేహితులతో కలిసి వీళ్లిద్దరూ ఓ ట్రిప్‌కి వెళ్తారు. ఓ బంగ్లాలో ఉంటారు. కానీ ఈ భవంతిలో ఓ ప్రేతాత్మ ఉంటుంది. అసలు అక్కడ ప్రేతాత్మ ఎందుకు ఉంది. అక్కడికి వచ్చిన వాళ్లని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది? చివరకు వంశీ, ప్రియ ఎలా బయటపడ్డారనేది స్టోరీ.
(ఇదీ చదవండి: నటి పాకీజాకు ఆశ్రయం కల్పించిన కోనసీమ వాసి)


