చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే ఏ తేదీన వస్తుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలుత విడుదల ఎప్పుడనేది అధికారికంగా అనౌన్స్ చేశారు.
(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)
శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 12న మూవీ థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తమ సినిమా షూటింగ్ నిన్నటితో(డిసెంబరు 12) పూర్తయిందని చెప్పాడు. అందుకే ఇవాళ్టి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టామని అన్నాడు. నిన్న చిరంజీవిగారితో చివరి వర్కింగ్ డే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ కాగా వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. భీమ్స్ సంగీత దర్శకుడు.
సంక్రాంతి బరిలో ఉన్నవాటిలో తొలుత ప్రభాస్ 'రాజాసాబ్' జనవరి 9న రానుంది. దీని తర్వాత చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 12న అంటే సోమవారం రిలీజ్ అవుతుంది. తర్వాత నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' 14వ తేదీన, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' 14వ తేదీన రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా పోటీలో ఉందని చెప్పారు గానీ డేట్ మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.
(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ)


