breaking news
bakasura restaurant movie
-
ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. కూలీ, పరదా, సయారా, సు ఫ్రమ్ సో.. ఇలా చాలా హిట్ చిత్రాలు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ కూడా రీసెంట్‌గానే డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల వచ్చే ఇబ్బందులు అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?గత కొన్నేళ్లలో తెలుగులో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్.. లీడ్ రోల్ చేసిన సినిమా 'బకాసుర రెస్టారెంట్'. ఆగస్టు తొలివారం థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది. అలాంటిది నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఈ సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాంటిది ఈ చిత్రం ఇప్పుడు సదరు ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) 'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఉద్యోగం చేస్తుంటాడు కానీ వ్యాపారం చేయాలని కోరిక. దీంతో రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ మొదలుపెడతాడు. ఓ దెయ్యంపై తొలి వీడియో చేస్తే అది తెగ వైరల్ అవుతుంది. అలాంటిదే మరో వీడియో చేసేందుకు ఓ పాత బంగ్లాకు తన స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తాడు. కట్ చేస్తే బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.బక్క సూరి ఆత్మతో పరమేశ్వర్, అతడి స్నేహితులు ఆడుకునే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దీనికి ఆకలికి ఎక్కువ. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్? ప్రోమో రిలీజ్) -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా
సాధారణంగా వీకెండ్లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో గురువారం అందుబాటులోకి వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు వారం మధ్యలోనే ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతోంది. లెక్క ప్రకారం ఈ వారాంతంలోనే డిజిటల్ రిలీజ్ ఉంది. కానీ ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ లీడ్ రోల్ చేసిన మూవీ 'బకాసుర రెస్టారెంట్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. దీన్ని సెప్టెంబరు 12న సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల ఇబ్బందులు, దాంతో వచ్చే భయం తదితర అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: నటి సుధ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు లీక్.. పోలీసులకు ఫిర్యాదు!)'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడంపై ఆసక్తి. రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. దాని కోసం డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ పెడతాడు. దెయ్యంపై చేసిన తొలి వీడియో వైరల్ కావడంతో రెండో వీడియో కోసం పాత బంగ్లాకు స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తారు. దీంతో బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.బక్క సూరి ఆత్మతో వాళ్లంతా ఆడే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దాని ఆకలికి హద్దుండదు. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ నేపథ్యమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
ఓటీటీలో హారర్, కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘బకాసుర రెస్టారెంట్’.. ఆగష్టు 8న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఎస్జే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటించాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ముఖ్యపాత్రల్లో నటించారు.‘బకాసుర రెస్టారెంట్’ హారర్, థ్రిల్లర్, మైథాలజీ కాన్సెప్ట్‌తో స్టోరీ ఉంటుంది. అయితే, ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ, ఓటీటీ ప్రేక్షకులకు నచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 12న 'సన్నెక్స్ట్' (Sun NXT)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది. మన స్నేహితుడు అనివార్య కారణాల వల్ల మనకు దూరమైతే ఎంతటి బాధ ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఆపై కామెడీ ఎటూ ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులకు మంచి కాలక్షేపాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు.కథేంటంటే..పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తినేస్తుంది.ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘బకాసుర రెస్టారెంట్’ మూవీ రివ్యూ
వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రవీణ్. ఆయన తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. ఎస్జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటించాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తిసేస్తుంది. ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్(ప్రవీణ్) గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక కామెడీ హారర్ చిత్రం. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో దెయ్యాన్ని తిండిబోతుగా చూపించడం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సాధారణగా కామెడీ హారర్ చిత్రాల్లో ఒక ఆత్మ ఉండడం..దానికో ఎమోషల్ ప్లాష్‌బ్యాక్.. క్లైమాక్స్‌లో దాని కోరిక నెరవేర్చడం.. ఇదే కథ. ఈ చిత్రంలో కూడా అవన్నీ ఉంటాయి. తాంత్రిక పూజకు సంబంధించిన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. హీరో పరిచయ సన్నివేశంతోనే అసలు కథ ప్రారంభం అవుతుంది. డబ్బుల కోసం యూట్యూబ్ వీడియోలు చేయాలనుకోవడం..గోస్ట్హౌస్కి వెళ్లడం..అక్కడ జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే ప్రతిసారి ఆ తరహా కామెడీనే చూపించడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. అంజిబాబు పాత్ర ఎంట్రీ, అతనిలోకి బకాసుర ఆత్మ వెళ్లిన తర్వాత మళ్లీ కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశారు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. బక్క సూరి ప్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఆత్మను అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించే సన్నివేశాలు అలరిస్తాయి. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే అల్లరి దెయ్యాలు కామెడీ ట్రాక్ వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్‌ని కాస్త ఎమోషనల్‌గా మలిచే ప్రయత్నం చేశారు. రొటీన్ కామెడీ హారర్ కథే అయినా... తిండిబోతు దెయ్యం మాత్రం కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు కమెడియన్‌గా అలరించిన ప్రవీణ్.. ఇందులో హీరోగా నటించి సినిమా భారం మొత్తం తన భుజాన వేసుకున్నాడు. తన బలమైన కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించాడు. వైవా హర్ష తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే యాక్ట్ చేశాడు. అంజిబాబు పాత్రకి ఫణి న్యాయం చేశాడు. ప్రవీణ్ స్నేహితులుగా నటించిన కుర్రాళ్ల కామెడీ టైమింగ్ బాగుంది. చాలా రోజుల తర్వాత కృష్ణ భగవాన్ వెండితెరపై మెరిశాడు. ఓ హోటల్ యజమానిగా కనిపించిన ఆయన.. తనదైన పంచ్ డైలాగులతో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
నేను హీరో అనుకోవడం లేదు: ప్రవీణ్
‘‘హాస్యనటులు హీరోగా మారితే కమెడియన్‌గా అవకాశాలు తగ్గిపోతాయని అంటుంటారు. అయితే నన్ను నేను హీరోగా భావిస్తే అలాంటి భావన ఇతరుల్లోనూ వస్తుంది. కానీ, ‘బకాసుర రెస్టారెంట్’ చిత్రంలో నేను లీడ్ రోల్ చేశాననే భావనతో ఉన్నాను. అందుకే ప్రస్తుతం ‘విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, లెనిన్, ఆకాశంలో ఓ తార’ వంటి చిత్రాలతో నటుడిగా బిజీగా ఉన్నాను’’ అని ప్రవీణ్ అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ హీరోగా నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్జే శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్ చేశారు. లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బకాసుర రెస్టారెంట్’ చిత్రం ఐదుగురు బ్యాచిలర్స్ పాత్రలతో నడుస్తుంది. ఇందులో కథను నడిపించే పరమేష్ అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో వినోదం, భావోద్వేగం ఉంటాయి. ఇకపైనా అన్ని రకాల పాత్రలు చేస్తాను. అయితే లీడ్ రోల్ చేయాలంటే పూర్తి వినోదాత్మక కథ ఉండాలి. ఎందుకంటే నాలాంటి కమెడియన్స్ నుంచి ప్రేక్షకులు వినోదాన్ని ఆశిస్తారు’’ అని తెలిపారు.