OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు హారర్‌ మూవీ | Bakasura Restaurant OTT Release: Telugu Horror Film Becomes Superhit on Amazon Prime | Sakshi
Sakshi News home page

Bakasura Restaurant : ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు హారర్‌ మూవీ

Oct 9 2025 3:35 PM | Updated on Oct 9 2025 3:48 PM

Bakasura Restaurant Movie Cross 250 Million Streaming Minutes In Prime Video

కొన్ని సినిమాలు థియేటర్స్‌లో కంటే ఓటీటీలోనే ఎక్కువ బాగా ఆడతాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఓటీటీ వరంలా మారింది. కంటెంట్ఉంటే చాలు.. కాస్టింగ్ని పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తున్నారు. ఇప్పటికే పలు చిన్న చిత్రాలు ఓటీటీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు హారర్సినిమా కూడా ఓటీటీలో రిలీజై సూపర్హిట్గా నిలిచింది. అదేబకాసుర రెస్టారెంట్‌’(Bakasura Restaurant ). పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ చిత్రంలో లీడ్ రోల్ చేశాడు

ఏడాది ఆగస్ట్లో థియేటర్స్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకున్న చిత్రం..ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. అమెజాన్ప్రైమ్వీడియోలో స్ట్రీమింగ్అవుతున్న టాప్చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కన్నప్ప, పరద, కూలి లాంటి సినిమాలను సైతం వెనక్కి నెట్టి, వరుసగా 24 రోజులుగా టాప్‌ 10లోనే ఉండడం గమనార్హం. అంతేకాదు ఇప్పటికే 250 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందంటే.. సినిమాను ఓటీటీ ప్రేక్షకులు స్థాయిలో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చను.

పెద్ద సినిమాల నడుమ నిలబడటం చాలా కష్టమని అందరూ అనుకునే పరిస్థితిలో, బకాసుర రెస్టారెంట్ మాత్రం ఆ అపోహను చెరిపేసింది. కంటెంట్ బలం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని మరొకసారి నిరూపించింది.

కథేంటంటే..
పరమేశ్వర్‌(ప్రవీణ్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్‌ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్‌ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్‌ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్‌ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్‌ అంతా తిసేస్తుంది.

ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్‌ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్‌ గ్యాంగ్‌ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్‌(ప్రవీణ్‌) గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్‌ పెట్టాలన్న పరమేశ్వర్‌ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement