breaking news
Comedy horror story
-
OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు హారర్ మూవీ
కొన్ని సినిమాలు థియేటర్స్‌లో కంటే ఓటీటీలోనే ఎక్కువ బాగా ఆడతాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఓటీటీ వరంలా మారింది. కంటెంట్ ఉంటే చాలు.. కాస్టింగ్‌ని పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తున్నారు. ఇప్పటికే పలు చిన్న చిత్రాలు ఓటీటీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ తెలుగు హారర్ సినిమా కూడా ఓటీటీలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. అదే ‘బకాసుర రెస్టారెంట్’(Bakasura Restaurant ). పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్‌లో థియేటర్స్‌లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకున్న ఈ చిత్రం..ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కన్నప్ప, పరద, కూలి లాంటి సినిమాలను సైతం వెనక్కి నెట్టి, వరుసగా 24 రోజులుగా టాప్ 10లోనే ఉండడం గమనార్హం. అంతేకాదు ఇప్పటికే 250 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందంటే.. ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చను.పెద్ద సినిమాల నడుమ నిలబడటం చాలా కష్టమని అందరూ అనుకునే పరిస్థితిలో, బకాసుర రెస్టారెంట్ మాత్రం ఆ అపోహను చెరిపేసింది. కంటెంట్ బలం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని మరొకసారి నిరూపించింది.కథేంటంటే..పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తిసేస్తుంది.ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిది అని తెలిసిన తర్వాత పరమేశ్వర్(ప్రవీణ్) గ్యాంగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది. చివరకు అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
నాకిది చాలా స్పెషల్
‘‘ఈ ‘గీతాంజలి’ సినిమా నాకు చాలా స్పెషల్. ఇందులో పాత్ర నచ్చి వెంటనే డేట్లు ఇచ్చేశాను. నా కెరీర్లోనే ఈ సినిమా ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అని అంజలి చెప్పారు. అంజలి, శ్రీనివాసరెడ్డి, హర్షవర్థన్ రాణే, బ్రహ్మానందం, రావు రమేష్ ముఖ్య తారలుగా కోన వెంకట్ సమర్పణలో రాజకిరణ్ దర్శకత్వంలో ఎమ్.వి.వి. సత్యనారాయణ నిర్మించిన ‘గీతాంజలి’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘అంజలి ఒప్పుకోకపోయుంటే మేం ఈ సినిమానే చేసి ఉండేవాళ్లం కాదు. హారర్ కామెడీ కథ ఇది. నా ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందంగారికి ఓ స్పెషల్ రోల్ ఉంటుంది. ఇందులో ఆయన ఓ మంచి రోల్‌తో పాటు, ఓ స్పెషల్ సాంగ్ చేశారు. రాజకిరణ్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని తెలిపారు. నటుడు హర్షవర్థన్, పంపిణీదారుడు హరి తదితరులు కూడా పాల్గొన్నారు.