breaking news
28 Years Later Movie
-
ఐఫోన్‌తో తీసిన జాంబీ సినిమా.. ఓటీటీ రివ్యూ
ఓటీటీల్లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. అందున హాలీవుడ్ నుంచి ఈ జానర్ మూవీస్ వస్తున్నాయి అంటే కచ్చితంగా భయపెట్టి తీరేలానే ఉంటాయి. అలా జూన్‌లో థియేటర్లలోకి వచ్చిన ఓ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే '28 ఇయర్స్ లేటర్'(28 ఏళ్ల తర్వాత). ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'స్లమ్ డాగ్ మిలీయనీర్'ని తీసిన డేనీ బోయెల్ దీనికి దర్శకుడు. మరి ఈ సినిమా అంతలా భయపెట్టిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)కథేంటి?2002లో రేజ్ వైరస్ రాకతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. అలా 28 ఏళ్లు గడిచిపోతాయి. బ్రిటన్‌లోని ఓ దీవిలో ఈ వైరస్ బారిన పడని కొంతమంది జీవిస్తుంటారు. హీరో జేమీ తన 12 ఏళ్ల కొడుకు స్పైక్, భార్యతో కలిసి బతుకుతుంటాడు. ఓ రోజు వేట కోసం జేమీ, స్పైక్.. మెయిన్ ల్యాండ్‌కు వెళ్తారు. ఇక్కడ మెయిన్ ల్యాండ్ అంటే జాంబీలు ఉండే ప్రదేశం. అక్కడ 'ఆల్ఫా' అనే బలమైన జాంబీ ఈ తండ్రి కొడుకులకు ఎదురుపడుతుంది. తర్వాత ఏమైంది? తిరిగి ద్వీపానికి చేరుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇదో జాంబీ సినిమా. అంటే వైరస్ సోకేసరికి చాలామంది మనుషులు రాక్షసుల్లా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు ఓ ద్వీపంలో తలదాచుకుంటారు. ఆ ద్వీపానికి జాంబీలు ఉండే ప్రదేశానికి మధ్యలో చిన్న దారి ఉంటుంది. కానీ రాత్రయితే ఆ దారి అంతా సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. అలాంటి వీళ్లలోని ఓ తండ్రి కొడుకు జాంబీల దగ్గరకు వెళ్తారు. తర్వాత ఊహించి పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడి నుంచి పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణ ఏర్పడుతుంది. తర్వాత ఏమైందనేది మూవీ చూసి ఎక్స్‌పీరియెన్స్ చేయాలి.ఈ సినిమాని కచ్చితంగా ఒంటరిగానే చూడండి. అలా అని బూతు సన్నివేశాలు ఏం ఉండవు. జాంబీలన్నీ బట్టల్లేకుండానే ఉంటాయి. కానీ ఒంటిపై బురదలాంటిది ఉంటుంది. కానీ జాంబీలని భయంకరంగా చంపడం లాంటి సీన్స్ ఉంటాయి. ఇదో హారర్ మూవీ అయినప్పటికీ మరోవైపు థ్రిల్ పంచుతూ మానవ సంబంధాలు, భావోద్వేగాలని కూడా చూపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.రెండు గంటల్లోపే ఉండే ఈ సినిమా నెమ్మదిగానే ఉంటుంది గానీ విజువల్స్ గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ కూడా మూవీలో మీరు లీనమయ్యేలా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఐఫోన్‌తో తీయడం విశేషం. అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ఓటీటీల్లోనూ ఉంది గానీ వాటిలో రెంట్ పద్ధతిలో చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే దీనిపై ఓ లుక్కేసేయండి.-చందు డొంకాన(ఇదీ చదవండి: రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)) -
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే
మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్లలో మిరాయ్, కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్ అలరిస్తున్నాయి. ఈ వీకెండ్ చాలానే సినిమాలు రాబోతున్నాయి. మంచు లక్ష్మీ 'దక్ష', బ్యూటీ, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు తదితర తెలుగు చిత్రాలతో పాటు భద్రకాళి, వీరచంద్రహాస, టన్నెల్ తదితర డబ్బింగ్ మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. అయితే వీటిలో దేనిపైనా ఏ మాత్రం హైప్ లేదు. వీటిలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)మరోవైపు ఓటీటీల్లో 15కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 28 ఇయర్స్ లేటర్, ఎలియో, ఇంద్ర, హౌస్ మేట్స్ తదితర మూవీస్‌తో పాటు ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్, ష్ సీజన్ 2, ద ట్రయల్ సీజన్ 2 సిరీస్‌లు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 15 నుంచి 21 వరకు)నెట్ఫ్లిక్స్ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 1828 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 20అమెజాన్ ప్రైమ్జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17బెలెన్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 18హాట్స్టార్ఎలియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 17సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 18పోలీస్ పోలీస్ (తమిళ సిరీస్) - సెప్టెంబరు 19ద ట్రయల్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 19స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్ఇంద్ర (తమిళ సినిమా) - సెప్టెంబరు 19మాటొండ హెలువే (కన్నడ మూవీ) - సెప్టెంబరు 19ఆహాష్ సీజన్ 2 (తెలగు సిరీస్) - సెప్టెంబరు 19జీ5హౌస్మేట్స్ (తమిళ సినిమా) - సెప్టెంబరు 19ఆపిల్ ప్లస్ టీవీద మార్నింగ్ షో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 17లయన్స్ గేట్ ప్లేద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 19(ఇదీ చదవండి: శేఖర్ కమ్ముల హిట్ మూవీ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోంది?) -
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ హాలీవుడ్ హారర్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చేసింది. జాంబీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత, 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ డాని బోయెల్ దర్శకత్వం వహించాడు. జూన్‌లో ఇది థియేటర్లలోకి రాగా అలా నెల దాటిందో లేదో ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ హారర్ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.2002లో రిలీజైన '28 డేస్ లేటర్', 2007లో విడుదలైన '28 వీక్స్ లేటర్' చిత్రాలకు సీక్వెల్ '28 ఇయర్స్ లేటర్'. దీన్ని రెండు భాగాలుగా తీశారు. ఇందులోని తొలి పార్ట్ జూన్‌లో రిలీజైంది. కాకపోతే థియేటర్లలో అనుకున్నంతగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయింది. మరి అందుకేనేమో ఇప్పుడు రెండు ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వీడియో అన్ డిమాండ్(రెంట్ విధానంలో) అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో ఈ మూవీ చూడొచ్చు. ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్‌లో రెండు తెలుగు థ్రిల్లర్స్)'28 ఇయర్స్ లేటర్' విషయానికొస్తే.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రేజ్ వైరస్ మహమ్మారిలా వ్యాపించేసరికి బ్రిటన్ ప్రజలందరూ జాంబీలుగా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు.. ఓ ఐలాండ్‌లో బతుకుతుంటారు. మరి అక్కడికి కూడా జాంబీలు ఎలా వచ్చేశారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. 'ఓపెన్‌హైమర్' నటుడు కిలియన్ మర్ఫీ.. జాంబీ పాత్ర చేశాడు. ఈ మూవీకి రెండో భాగం '28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్'.. వచ్చే జనవరిలో థియేటర్లలోకి రానుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి దాదాపు 25కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉండటం విశేషం. 3 బీహెచ్‌కే, తమ్ముడు, నెట్వర్క్, జిన్ ద పెట్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని సర్ప్రైజ్ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?)